బుల్లితెరపై ప్రతి ఒక్కరూ మెచ్చే అందాల యాంకర్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ ఒలికిస్తూనే వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో ఈ రంగమ్మత్త దూసుకుపోతోంది. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.
26
Allu Arjun
నేడు అల్లు అర్జున్ తన 40వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. బన్నీ బర్త్ డే కావడంతో అభిమానులు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. దీనితో అల్లు అర్జున్ బర్త్ డే కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వైరల్ గా మారాయి.
36
Allu Arjun
కిల్లర్ లేడి ద్రాక్షాయణి కూడా అల్లు అర్జున్ కి తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలిపింది. అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బన్నీ.. టాలీవుడ్ ని రీ డిఫైన్ చేస్తూ భారీ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా. పుష్ప ది రూల్ తో రూల్ చేద్దాం.. అస్సలు తగ్గేదే లే' అంటూ అనసూయ కామెంట్స్ చేసింది.
46
Allu Arjun
పుష్ప 2లో ద్రాక్షాయణిగా అనసూయ విలనిజం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పుష్పని అంతమొందించేందుకు అనసూయ.. షెకావత్, కొండారెడ్డి రెండవ తమ్ముడితో చేతులు కలపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
56
Allu Arjun
అల్లు అర్జున్ ని వారు పెట్టే ఇబ్బందులు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి అని.. ఆ సమస్యల సుడిగుండంలో నుంచి పుష్ప రాజ్ ఎలా బయట పడ్డాడు అనేది పార్ట్ 2 కథ అని అంటున్నారు. పుష్పకి వెన్నుపోటు పొడిచే ఎపిసోడ్ లో అనసూయ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. దీనితో పుష్ప పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
66
Anasuya Bharadwaj
అనసూయ మొదటి భాగంలో భర్త చాటు భార్యగా మాత్రమే కనిపించింది. తన తమ్ముడి మరణంతో రగిలిపోయే ద్రాక్షాయణి ఏకంగా తన భర్తనే చంపేదుకు కూడా సిద్ధపడుతుంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు అనసూయ రోల్ పార్ట్ 2లో ఎంత భయంకరంగా ఉండబోతోందో అని.