Reddy Garintlo Rowdyism Review: `రెడ్డిగారింట్లో రౌడీయిజం` మూవీ రివ్యూ

First Published | Apr 8, 2022, 3:30 PM IST

టీజర్‌, ట్రైలర్‌తో ఆసక్తి పెంచుకున్న `రెడ్డిగారింట్లో రౌడీయిజం` చిత్రం వరుణ్‌ తేజ్‌ `గని`, త్రిగుణ్‌ నటించిన `కథ కంచికి మనం ఇంటికి` చిత్రాలతో పాటు విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది `రివ్యూ`లో తెలుసుకుందాం. 

సీనియర్‌ హీరో వినోడ్‌ కుమార్‌ విలన్‌గా నటించిన చిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. రమణ్‌ హీరోగా, ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి ఎం. రమేష్‌, గోపీ దర్శకత్వం వహించారు. సిరి బ్యానర్‌పై కె శిరీషా రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. టీజర్‌, ట్రైలర్‌తో ఆసక్తి పెంచుకున్న ఈ చిత్రం వరుణ్‌ తేజ్‌ `గని`, త్రిగుణ్‌ నటించిన `కథ కంచికి మనం ఇంటికి` చిత్రాలతో పాటు విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది `రివ్యూ`లో తెలుసుకుందాం. Reddy Garintlo Rowdyism Review

కథ:
 ప్రతాప్ రెడ్డి(వినోద్ కుమార్) గ్రామంలో కులాంతర వివాహాలకు, లవ్‌ మ్యారేజెస్‌కి వ్యతిరేకం.  తన పక్క గ్రామానికి చెందిన శివ(ర‌మ‌ణ్) ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే ఓ గ్రామీణ యువకుడు. తండ్రి(జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా అమ్మాయిల చుట్టూ  ప్రేమ పేరుతో తిరుగుతుంటాడు. తన క్లాస్ మేట్ అయిన సంధ్య (ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు శివ. ఈమె ప్రతాప్ రెడ్డి కూతురు. అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి వీరి వివాహానికి ఒప్పుకున్నాడా? వీరిద్దరి లవ్‌లో ఉన్న ట్విస్ట్ ఏంటీ? చివరికి వీరి ప్రేమ ఏ తీరం చేరింది. ప్రతాప్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నాడా? ప్రేమ కోసం మారాడా? అనేది మిగిలిన సినిమా. Reddy Garintlo Rowdyism Review


విశ్లేషణ: 
ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాల జోరు సాగుతుంది. అయినప్పటికీ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లకి స్కోప్‌ ఉంది. బాగా ఎంగేజ్‌ చేసేలా, ఎంటర్‌టైన్‌ చేసేలా ఉంటే మంచి ఆదరణ పొందుతున్నాయి. బాక్సాఫీసు వద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కమర్షియల్‌ అంశాలతో, లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సందేశం మేళవింపుతో వచ్చిన చిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. కులం, మతం కంటే... ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వం అనే సందేశంతో తెరకెక్కిన చిత్రమిది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను చంపడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం, వారిపై దాడులు చూస్తేనే ఉన్నాం. ఆలాంటి సున్నితమైన సబ్జెక్టును ఎంచుకుని, దానికి కమర్షియల్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని సందేశాత్మకంగా మలిచి దర్శకులు రమేష్‌, గోపీ సేఫ్‌ గేమ్‌ ఆడారని చెప్పొచ్చు. Reddy Garintlo Rowdyism Review

ఇలాంటి చిత్రాలు ఇప్పటికే చాలా వచ్చినా ఇది ఎప్పటికీ సెలబుల్‌ కంటెంట్‌గా నిలుస్తుంది. అక్కడక్కడ కాస్త రెగ్యూలర్‌గానే అనిపించినా, కాస్త స్లోగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లు, కామెడీ ఆకట్టుకుంటాయి. సినిమా కోసం వారు పడిన కష్టం కనిపిస్తుంది. అయితే ఇంకాస్త ఎంగేజింగ్‌గా, మరింత భిన్నంగా స్క్రీన్‌ప్లే రాసుకుంటే ఫలితం ఇంకోలా ఉండేది. వినోద్‌ కుమార్‌ తప్ప పెద్దగా నోటెడ్‌ యాక్టర్స్ ఉంటే ఇంకా బాగుండేది. 
 

నటీనటులుః 
ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో ర‌మ‌ణ్‌ ఫర్వాలేదనిపించాడు. తనవంతుగా మెప్పించే ప్రయత్నం చేశాడు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో.. అలా అలరించారు.  పాటలు, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతనికిది మంచి డెబ్యూగా చెప్పొచ్చు. అలానే అందమైన ముద్దుగుమ్మలు నలుగురూ ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష అందాలు సినిమాకి ప్లస్‌ అయ్యాయి. సీనియర్ హీరో వినోద్ కుమార్ మరోసారి తన మార్కు నటన విలనిజంతో మెప్పించారు. రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ అండ్ బ్యాచ్ కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. 

సాంకేతిక వర్గం పనితీరుః 
దర్శకులిద్దరూ ఎం. ర‌మేష్‌, గోపి ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా బాగానే డీల్‌ చేశారు. ఒక డెబ్యూ హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఓకే. మ‌హిత్ నారాయ‌ణ్‌ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఎ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది.  శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ల ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి. నిర్మాత‌ కె.శిరీషా ర‌మ‌ణారెడ్డి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ ఫర్వాలేదు. ఓవరాల్‌గా సినిమా మంచి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. 

Latest Videos

click me!