జబర్దస్త్ యాంకర్స్ మధ్య బయటపడ్డ విబేధాలు... వేదిక మీదే గొడవకు దిగిన రష్మీ-సౌమ్య!

Published : Dec 16, 2022, 11:59 AM IST

సౌమ్యరావు శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్ కి యాంకర్ గా వచ్చారు. ఆ వేదికపై రష్మీ, సౌమ్య ఎదురుపడ్డారు. ఎవరు గొప్పో తేల్చుకున్నారు.

PREV
17
జబర్దస్త్ యాంకర్స్ మధ్య బయటపడ్డ విబేధాలు... వేదిక మీదే గొడవకు దిగిన రష్మీ-సౌమ్య!
Rashmi gautam


మన ఆధిపత్యానికి గండి కొట్టడానికి ఎవరైనా వస్తే నచ్చదు. ఓర్చుకోలేం కూడా. కొత్త యాంకర్ సౌమ్యరావు రాకతో రష్మీ ఒక షో కోల్పోయింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం అవుతుండగా... తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

27
Rashmi gautam


అనసూయ(Anasuya) జబర్దస్త్ మానేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. నిర్మాతలు చాలా ఆలోచించి వెంటనే కొత్త యాంకర్ ని తేకుండా రష్మీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఉన్న రష్మీ, జబర్దస్త్ యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ డబుల్ పేమెంట్ అందుకుంది. 
 

37
Rashmi gautam

అయితే రష్మీ సంపాదనకు సౌమ్య రావు గండి కొట్టింది. కొన్ని వారాల తర్వాత కన్నడ టెలివిజన్ నటి, ప్రెజెంటర్ సౌమ్యరావుని రంగంలోకి దించారు. జబర్దస్త్ యాంకర్ గా అవకాశం ఇచ్చారు. సౌమ్యరాకతో మళ్ళీ రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి పరిమితం కావాల్సి వచ్చింది. 
 

47
Rashmi gautam

కొత్త యాంకర్ సౌమ్యరావు(Soumya Rao)పై మీ ఫీలింగ్ ఏమిటంటే... నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఉండేది కొన్ని వారాలే అని ముందే చెప్పారు. కొత్త యాంకర్ వచ్చాక వెళ్లిపోవాలని సూచించారు. కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని రష్మీ గౌతమ్ వెల్లడించారు. అయితే ఎక్కడో నా ప్లేస్ ని లాగేసుకుందనే అసహనం రష్మిలో ఉంది. అది తాజాగా బయటపడింది. 
 

57
Rashmi gautam


సౌమ్యరావు శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసోడ్ కి యాంకర్ గా వచ్చారు. ఆ వేదికపై రష్మీ, సౌమ్య ఎదురుపడ్డారు. ఎవరు గొప్పో తేల్చుకున్నారు. 'కొత్త యాంకర్ రాగానే వెళ్లిపోవడానికి నేనేమన్నా ఆ పాత ముగ్గురు యాంకర్స్ అనుకుంటున్నావా?' అని రష్మీ సౌమ్యరావుతో అన్నారు. సౌమ్యరావు వెంటనే రష్మీకి పంచ్ వేసింది. 

67
Rashmi gautam

పాత యాంకర్స్ ముగ్గురు కాదు నీతో కలిపి నలుగురు, అంటూ షాక్ ఇచ్చింది. జబర్దస్త్ యాంకర్స్ గా అనసూయతో పాటు వర్షిణి, సమీరా కూడా వ్యవహరించారు. వారిని ఉద్దేశించి రష్మీ ఆ కామెంట్ చేశారు. వాళ్ళ లిస్ట్ లో రష్మీని కూడా చేర్చింది, సౌమ్యరావు. 
 

77
Rashmi gautam

ఇద్దరూ నేను గొప్పంటే నేను గొప్పంటూ గొడవకు దిగారు. దీంతో జబర్దస్త్ జడ్జి ఇంద్రజ రంగంలోకి దిగారు. ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ తో రష్మీ(Rashmi Gautam), జబర్దస్త్ టీమ్ తో సౌమ్యరావు పోటీపడాలి. మెప్పించిన టీమ్ లీడర్ జబర్దస్త్ యాంకర్ అవుతారని పోటీపెట్టారు. ఇక జడ్జి ఇంద్రజను మెప్పించడం కోసం సౌమ్యరావు, రష్మీ అదిరిపోయే డాన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. 
 

click me!

Recommended Stories