NTR 30 షూటింగ్ ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్ వీడియో ప్లాన్ చేస్తోన్న తారక్

Published : Dec 16, 2022, 11:59 AM ISTUpdated : Dec 16, 2022, 12:02 PM IST

చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తారక్ త్వరలోబరిలోకి దిగబోతున్నాడు. అసలు ఉంటుందా లేదా అనుకున్న కొటాల సినిమాను సెట్స్ ఎక్కించడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు టీమ్. 

PREV
17
NTR 30 షూటింగ్ ముహూర్తం ఫిక్స్..  ఫ్యాన్స్ కోసం సర్ ప్రైజ్   వీడియో ప్లాన్  చేస్తోన్న  తారక్

RRR తో సూపర్ డూపర్ సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.  ఓ మూడు నాలుగు కథలను లైన్ లో పెట్టిన తారక్  కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా కన్ ఫార్మ్ చేశాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్  టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈమూవీని చాలా కాలంగా షూటింగ్ స్టార్ట్ చేయకుండా నానుస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వచ్చిన మోషన్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

27

ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ సినిమాపై  ఓ రేంజ్ లో హైప్ ని ఇచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని  నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈక్రమంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హీరో అవ్వడం..  కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ అవ్వడం, రాజమౌళితో సినిమా చేస్తే.. నెక్ట్స్ హిట్ హీరోలకు ఉండదు అని సెంటిమెంట్ ఉండటంతో.. అందిరిలో అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. 

37

అసలు ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అని అనుకున్నారు. దానికి బలం చేకూర్చుతూ..  NTR30 సెట్స్ పైకి వెళ్లడం రోజురోజుకు లేట్ అవుతూ వచ్చింది.  దాంతో కన్ ఫ్యూజన్ తో పాటు.. తారక్ అభిమానులకు కూసింత కోపం కూడా వచ్చింది. సోషల్ మీడియాలో హడావిడి చేయడం కూడా మొదలెట్టారు.  
 

47

ఇక ఇలా కన్ ఫ్యూజన్ లో ఉన్న అభిమానులకు షూటింగ్ ఇప్పుడు.. అప్పుడూ అంటూ వచ్చిన వార్తలు ఇంకా చిర్రెత్తుకు వచ్చేలా చేశాయి. దాంతో తన అభిమానులకు  ఎన్టీఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఏదో రూమర్ లా ఉండకుండా.. దాని కోసం స్పెషల్ వీడియో కూడా రెడీ చేస్తున్నాడు.  కొరటాలతో జూనియర్ చేయబోయే సినిమా పట్టాలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఫిబ్రవరి 2023 నుంచి కొరటాల ఎన్టీఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుందని సమాచారం. 
 

57

నార్మల్ గా రాసుకున్న కథ కావడంతో.. ఎన్టీఆర్ కొరటాల స్క్రిప్ట్‌ కు చేంజస్ చెప్పారట. ఏమౌతుందో అని భయంతో ఉన్న దర్శకుడికి తారక్ ధైర్యం చెప్పడంతో పాటు.. ఇద్దరు కలిసి కథపై కసరత్తులు కూడా చేసినట్టు సమాచారం. ఎట్టకేలకు శివ పర్ఫెక్ట్ కథను తారక్ కు వినిపించడం.. దానితో ఆయన  సంతృప్తి చెందినట్లు సమాచారం. 

67

 అయితే ముందుగా ఈసినిమా ను వచ్చే ఏడాది జనవరిలోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కాని కొన్ని కారణాల వల్ల మళ్లీ పిబ్రవరికి మార్చుకున్నట్టు తెలుస్తోంది. సాలిడ్  యాక్షన్ సీక్వెన్స్ లతో  తో పాటు.. ఎమోషన్ బేస్డ్ కథతో తెరకెక్కబోతున్న ఈసినిమా లో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపించింది. టీమ్ కన్ పార్మ్ చేయలేదు. ఇక ఈసినిమాకు తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్  అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 

77

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ .. అన్నింటికి గ్యాప్ ఇచ్చి ఫారెన్ టూర్ కు వెళ్ళాడు. ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారక్కడ. ఇక  కొరటాల సినిమాతో పాటు ఎన్టీఆర్... కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ తో ఎప్పుడో ఫిక్స్ అయ్యింది. తారక్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కాని షూటింగ్ విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది. 

click me!

Recommended Stories