అందుకే ప్లాస్మా ఇవ్వలేదు.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి

First Published Sep 1, 2020, 5:07 PM IST

రాజమౌళి కూడా ప్లాస్మా డొనేషన్‌ విషయంలో అభిమానుల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. రాజమౌళి కుటుంబం కరోన నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తరువాత తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న త్వరలోనే ప్లాస్మా డొనేషన్‌ చేస్తానని చెప్పారు.

కరోనాతో పోరాడుతున్న వారి ప్రాణాన్ని కాపాడేందుకు ప్లాస్మా చికిత్స ఓ సంజీవనిగా భావిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి తీసుకున్న ప్లాస్మాతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడే అవకాశం ఉండటంతో వైధ్యులు ఎక్కువగా ఇదే పద్దతిని నమ్ముతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీ ప్లాస్మా డొనేషన్‌ మీద అవగాహన కల్పిస్తున్నారు.
undefined
ఇలాంటి వాటిలో ఎప్పుడూ ముందే ఉండే రాజమౌళి కూడా ప్లాస్మా డొనేషన్‌ విషయంలో అభిమానుల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు. రాజమౌళి కుటుంబం కరోన నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. తరువాత తెలంగాణ పోలీసులు నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న త్వరలోనే ప్లాస్మా డొనేషన్‌ చేస్తానని చెప్పారు.
undefined
అయితే ఈ రోజు (సోమవారం) రాజమౌళి సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు భైరవలు ప్లాస్మా డొనేషన్‌ చేశారు. దీంతో అభిమానులు రాజమౌళి ఎందుకు చేయలేదన్న ఆలోచనలో పడ్డారు. అయితే ఈ విషయం జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. కరోనా నుంచి కోలుకున్న కొద్ది రోజుల్లోనే ప్లాస్ డొనేట్‌ చేయాలన్నారు. కరోనా సమయంలో బాడీలో ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్‌ కొద్ది రోజులు మాత్రమే శరీరంలో ఉంటాయన్నారు.
undefined
రాజమౌళి యాంటీ బాడీస్‌ పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్ 8.62 మాత్రమే ఉన్నాయని, అవి 15 ఉంటేనే ప్లాస్మా డొనేట్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే తాను ప్లాస్మా డొనేట్‌ చేయలేక పోయానని క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.
undefined
click me!