Rajamouli: రాజమౌళి జీవితాశయం, మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ ?.. ఎవరెవరు, ఏ పాత్రల కోసమో తెలుసా..

Published : Feb 20, 2026, 03:09 PM IST

రాజమౌళి తెరకెక్కించబోయే మహా భారతంలో ముగ్గురు హీరోలు ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు హీరోలు ఎవరు.. ఏ పాత్రలలో వారు నటించబోతున్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
రాజమౌళి వారణాసి మూవీ

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ లో రూపొందుతోంది. మగధీర చిత్రాన్ని 40 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కించినప్పుడే ఇండస్ట్రీ మొత్తం నివ్వెర పోయింది. ఇప్పుడు రాజమౌళి రేంజ్ 1300 కోట్లకు చేరుకుంది. వారణాసి తర్వాత రాజమౌళి నెక్స్ట్ బిగ్ టార్గెట్ మహా భారతమే అనే వార్తలు వస్తున్నాయి.

25
వారణాసి తర్వాత మహా భారతం ?

మహా భారతం చిత్రాన్ని తెరకెక్కించడం తన జీవితాశయం అని రాజమౌళి పలు సందర్భాల్లో తెలిపారు. అయితే రాజమౌళి మహా భారతం చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రిపరేషన్ ప్రారంభించలేదు. కానీ రూమర్స్ మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి.

35
ముగ్గురు హీరోలు ఫిక్స్ ?

రాజమౌళి మహాభారతంలో ఆల్రెడీ ముగ్గురు హీరోలు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురిలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర అత్యంత కీలకం. మహా భారతం మొత్తం పాండవులని సరైన మార్గంలో నడిపించేది శ్రీ కృష్ణుడే. అలాంటి కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ సెట్ అవుతాడు అని రాజమౌళి గతంలో తెలిపారు.

45
ఆ పాత్ర కోసం ప్రభాస్

మహా భారతంలో మరో కీలకమైన పాత్ర కర్ణుడు. ఈ పాత్ర కోసం ప్రభాస్ ని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరుడిగా, ఎమోషనల్ గా కనిపించాలంటే ప్రభాస్ బాగా సెట్ అవుతాడు. ఆల్రెడీ ప్రభాస్ కల్కి చిత్రంలో కర్ణుడిగా నటించారు.

55
నేచురల్ స్టార్ కి కూడా ఛాన్స్

ఇక నేచురల్ స్టార్ నాని కూడా మహాభారతంలో ఉంటాడు అని రాజమౌళి ఓ సందర్భంలో తెలిపారు. అయితే అది ఏ పాత్ర అనేది రివీల్ చేయలేదు. సో ఇప్పటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్, నాని మహాభారతంలో నటించబోతున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories