హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన మాజీ ప్రియుడి గురించి ఓ షాకింగ్ విషయం చెప్పింది. తాను హృతిక్ రోషన్‌తో నటించడం చూసి, అతను తట్టుకోలేకపోయాడ. దాంతో ఏం చేశాడంటే? అది కేవలం అతని ఇన్సెక్యూరిటీ వల్లే జరిగిందని ఆమె క్లారిటీ ఇచ్చింది.
తాను హృతిక్ రోషన్‌తో నటించడం తన మాజీ ప్రియుడు అస్సలు తట్టుకోలేకపోయాడట. అందుకే ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఓ సీక్రెట్ బయటపెట్టింది. అప్పట్లో వాళ్లిద్దరూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉండేవారట. దాంతో, తాను అందమైన హీరోలతో టైమ్ స్పెండ్ చేస్తున్నానని అతను తప్పుగా అనుకున్నాడని మృణాల్ చెప్పింది.
25
మృణాల్ ఠాకూలర్ ఫారెన్ బాయ్‌ఫ్రెండ్
‘నా కెరీర్ మొదట్లో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్‌లతో నటించాను. నేను లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లను నమ్ముతాను. దానివల్ల మన పని మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు. స్కాండినేవియాకు చెందిన నా బాయ్‌ఫ్రెండ్, నేను హ్యాండ్సమ్ హీరోలతో నటిస్తున్నానని తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాళ్లలా కనిపించాలని వర్కౌట్లు మొదలుపెట్టాడు’ అని మృణాల్ వివరించింది.
35
తప్పుగా అర్ధం చేసుకుని..
‘ఒక్కసారిగా విపరీతంగా వర్కౌట్లు చేసి 17 కిలోల బరువు తగ్గాడు. ఆ తర్వాత ఓ దశలో వర్కౌట్ ఆపేసి, తినడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏకంగా 20 కిలోలు పెరిగాడు. నీ హీరోలతో పోటీ పడటం నా వల్ల కాదు అని చెప్పేశాడు. కానీ, అతను బరువు తగ్గాలని నేను ఒక్క మాట కూడా అడగలేదు. అది పూర్తిగా అతని అభద్రతాభావమే. కండలు తిరిగిన అబ్బాయే కావాలని నేను ఎప్పుడూ చెప్పలేదు’ అని మృణాల్ స్పష్టం చేసింది.
మృణాల్ తన కొత్త సినిమా ‘దో దీవానే షెహర్ మేం’ ప్రమోషన్లలో ఈ విషయాలు పంచుకుంది. ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటిస్తున్నాడు. ప్రేమ అంటే ‘రీ-పేరెంటింగ్’ లాంటిదని, ప్రేమలో ఉన్నవాళ్లు ఒకరికొకరు ఎదుగుదలకు సాయపడాలని మృణాల్ చెప్పింది. ఇద్దరి మధ్య అహం ఉండకూడదని, ప్రేమ మాత్రమే ఉండాలని అంది.
55
ధనుష్‌తో మృణాల్ రూమర్ల సంగతేంటి?
కమల్ హాసన్ కూతురితో విడాకులు తీసుకున్న నటుడు ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తోందని రూమర్స్ వస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే. ఈ టైంలోనే మృణాల్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ గురించి ఈ విషయాలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.