Srinivasa Mangapuram 5 Days Collections: మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అయిన `శ్రీనివాస మంగాపురం` గత గురువారం థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రానికి కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?
సూపర్‌స్టార్ కృష్ణ రెండో తరం నుంచి, మహేష్ బాబు కుటుంబం నుంచి వచ్చిన తొలి వారసుడు జై కృష్ణ. ఆయన మహేష్ అన్న రమేష్ బాబు కొడుకు కావడం విశేషం. జై కృష్ణ `శ్రీనివాస మంగాపురం` చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. బాలీవుడ్ నటి రవీనా టండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహించడం విశేషం. వైజయంతి మూవీస్ సి అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై జెమినీ(పి) కిరణ్ నిర్మించారు. ఈ మూవీలో మోహన్ బాబు, వాసుకి, శ్యామ్ కీలక పాత్రలు పోషించారు. గురువారం(జులై 30)న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.
24
శ్రీనివాస మంగాపురం మూవీకి డివైడ్ టాక్
చాలా వరకు రొటీన్ స్టోరీ అని, రెగ్యూలర్ కమర్షియల్ మూవీ అన్నారు. ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోకి ఇలాంటి ఇంట్రడక్షనా? అనే విమర్శలు కూడా వచ్చాయి. లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గ కథలతో వస్తే బాగుండనే కామెంట్లు చాలా వరకు వినిపించాయి. దర్శకుడు టేకింగ్, మేకింగ్ పరంగానూ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. మొత్తంగా పాజిటివ్ కంటే నెగటివ్ ఈ సినిమాని చుట్టిముట్టింది. ఇది వసూళ్లపై ప్రభావం చూపించిందని చెప్పొచ్చు. అయినా ప్రారంభంలో డీసెంట్ కలెక్షన్లని వసూలు చేసింది.
34
శ్రీనివాస మంగాపురం కలెక్షన్లు
`శ్రీనివాస మంగాపురం` మూవీ కలెక్షన్లు చూస్తే(సాక్నిల్క్ సైట్ ఆధారంగా) మొదటి రోజు రూ.1.25కోట్లు రాబట్టగా, రెండో రోజు 88 లక్షలు, మూడో రోజు రూ.83లక్షలు, నాల్గో రోజు రూ.83లక్షలు వసూలు చేసింది. ఇక సోమవారం భారీగా డ్రాప్ అయ్యింది. కేవలం రూ.31లక్షలు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఈ చిత్రం ఇండియాలో రూ.4.63 కోట్ల గ్రాస్, రూ.4.10కోట్ల నెట్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 25లక్షలు వచ్చాయి. టోటల్‌గా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.4.88కోట్ల కలెక్షన్లని సాధించింది. ఈ లెక్కన దీనికి రెండున్నర కోట్ల షేర్ వచ్చింది.
ఈ సినిమా హిట్ కావాలంటే పది కోట్ల షేర్ రావాలి. అంటే ఇరవై కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు చూస్తే కనీసం ఇది పది కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే జరిగితే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఇది నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.20కోట్లు. నాన్ థియేట్రికల్‌గా కూడా దీనికి అంతంతగానే వచ్చిందని సమాచారం. మొత్తంగా ఈ మూవీ పరాజయం దిశగా వెళ్తుందని ట్రేడ్ వర్గాల టాక్.