టాలీవుడ్ లో 1 నుంచి 10 వరకు అన్నీ స్థానాలు చిరంజీవివే. 11 వ స్థానం బాలకృష్ణది. కానీ చిరంజీవి అన్నీ పిచ్చి సినిమాలు చేస్తున్నారు అంటూ ఓ దర్శక నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ లో 1 నుంచి 10 వరకు అన్నీ స్థానాలు చిరంజీవివే అని దర్శకరత్న దాసరి నారాయణ రావు ఓ సందర్భంలో తెలిపారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవి 1 టూ 10 అని మేమంతా అంటుంటాం. అది నిజమే అని తమ్మారెడ్డి అన్నారు.
25
బాలయ్య స్థానం 11
చిరంజీవి 1 టూ 10 అయినప్పుడు బాలకృష్ణ 11 అవుతారు. దీని గురించి నేను ఇంద్ర మూవీ టైంలో మాట్లాడాను. నేనేం తప్పుగా మాట్లాడలేదు. ఇంద్ర సినిమాకి ముందు బాలకృష్ణ గారి సినిమాలు 30 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టాయి. ఇంద్ర కూడా 30 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.
35
కానీ చిరంజీవి రేంజ్ అది కాదు
కానీ చిరంజీవి గారి రేంజ్ అది కాదు. ఆయన నెంబర్ 1 కాబట్టి ఎక్కడో 100 కోట్ల రేంజ్ లో ఉండాలి. మీరు చేయాల్సింది ఈ సినిమాలు కాదు అని చిరంజీవి గారికి చెప్పా. ఇంకా బలమైన కథలు చేసి 100 కోట్ల రేంజ్ లో ఉండాలి అని చెప్పా. అలా చెప్పడం తప్పా. కానీ చిరంజీవి వారు మాత్రం అవే పిచ్చి కథలు చేస్తూ.. 6 పాటలు 5 ఫైట్స్ ఉండే సినిమాలు చేస్తూ 30 కోట్ల వద్దే ఆగిపోయారు. అదీ నేను చెప్పాలనుకున్న విషయం.
కానీ చిరంజీవి అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు. 11వ స్థానంలో ఉన్న బాలయ్య సినిమాలే 30 కోట్లు చేసినప్పుడు.. చిరంజీవి గారి సినిమా 30 కోట్లు చేస్తే ఎలా పెద్ద సినిమా అవుతుంది. చిరంజీవి గారు నెంబర్ 1గా ఉన్నప్పుడు ఇంకా హై రేంజ్ ఉండాలి కదా అని తమ్మారెడ్డి అన్నారు.
55
అర్థం చేసుకోనివాళ్ళు తిట్టారు
తన శక్తిని తాను గుర్తించడంలో చిరంజీవి ఫెయిల్ అయ్యారు. ఎప్పుడూ డాన్సులు, ఫైట్స్ ఉండే సినిమాలు మాత్రమే కాదు.. ఇంకా మంచి సినిమాలు చేయాలి కదా అని తమ్మారెడ్డి అన్నారు. నేను చెప్పిన విషయాన్ని కొంతమంది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోనివాళ్ళు తిట్టారు అంటూ తమ్మారెడ్డి తెలిపారు.