Newtons 3rd Law 4 Days Collections: సుమంత్‌ మూవీకి దారుణమైన కలెక్షన్లు.. కనీసం హీరో రెమ్యూనరేషన్‌ కూడా రాలేదా?

Published : Aug 04, 2026, 08:01 AM IST

సుమంత్‌ హీరోగా నటించిన `న్యూటన్స్ థర్డ్ లా` మూవీ గత శుక్రవారం విడుదలైంది. నెగటివ్‌ టాక్‌ ని తెచ్చుకుంది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే, ఆశ్చర్యపోవాల్సిందే.

PREV
14
న్యూటన్స్ థర్డ్ లా తో సందడి చేస్తోన్న సుమంత్‌

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా నిరూపించుకున్నారు సుమంత్‌. ఒకప్పుడ ఆయన బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌ చేశారు. లవ్‌ స్టోరీస్‌, మాస్‌ యాక్షన్‌ చిత్రాలతో మెప్పించారు. కానీ చాలా కాలంగా ఆయన నటించిన సినిమాలు థియేట్రికల్‌గా సక్సెస్‌ కాలేకపోతున్నాయి. `మళ్లీ రావా` బౌన్స్ బ్యాక్‌ అయ్యేలా చేసినా, ఆ తర్వాత చిత్రాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. దీంతో ఓటీటీ చిత్రాలు చేస్తున్నారు. థియేట్రికల్‌ మూవీస్‌ తగ్గించారు. ఇటీవల ఆయన `న్యూటన్స్ థర్డ్ లా` అనే చిత్రం ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఇది నిజానికి ఓటీటీ మూవీ. కానీ థియేటర్లో విడుదల చేశారు. జులై 31న విడుదలైంది. ఈ సినిమాలో జగపతిబాబు, శ్రీనివాస్‌ అవసరాల, రవి వర్మ, షెల్లీ ఎన్‌ కుమార్‌, త్రినాథ్‌ వర్మ, నేహా పఠాన్‌, పండిత్‌ గౌతమ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. రాజేష్‌ కర్ణ దర్శకత్వంలో మార్క్ మై వర్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హరీష్‌ కొహిర్కర్‌ నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

24
న్యూటన్స్ థర్డ్ లా మూవీకి నెగటివ్ టాక్‌

సుమంత్‌ ప్రధాన పాత్రతో రూపొందిన ఈ మూవీ డెత్‌ కేసు చుట్టూ తిరుగుతుంది. సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన త్రినాథ్‌ వర్మ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ కేసుని విచారించేందుకు ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ అయిన సుమంత్‌ రంగంలోకి దిగుతాడు. త్రినాథ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునే క్రమంలో ఇదొక హత్య అని తెలుస్తుంది. మేడ మీద నుంచి పడిపోయిన దాంట్లో హత్య దాగుందని, ఎవరో తుపాకీతో కాల్చారనే విషయం తెలుస్తుంది. మరి ఆ హత్య చేసింది ఎవరు? జగపతిబాబు పాత్ర ఏంటి? శ్రీనివాస్‌ అవసరాల ఏం చేశాడు? నేహా పఠాన్‌ యాక్సిడెంట్‌కి కారణం ఎవరు అనే సస్పెన్స్ అంశాల సమాహారమే సినిమా. కొన్ని ట్విస్ట్ లు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకునేలా లేదనే టాక్‌ వచ్చింది. స్లోగా ఉందని, సీరియల్‌ని తలపించిందని, ఇంటెన్సిటీ లేదని, ఎమోషన్స్ లేవని, సస్పెన్స్ అంశాలు ఆకట్టుకునేలా లేవని, ట్విస్ట్ లో పస లేదనే విమర్శలు వచ్చాయి.

34
న్యూటన్స్ థర్డ్ లా మూవీ కలెక్షన్లు

విమర్శలు మాత్రమే కాదు, కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. ఒక స్టార్‌ హీరోగా రాణించిన సుమంత్‌ సినిమాకి ఇలాంటి కలెక్షన్లు షాకిస్తున్నాయి. మొదటి రోజు ఈ మూవీకి రూ.13లక్షలు మాత్రమే వచ్చాయి. రెండో రోజు రూ.24లక్షలు, మూడో రోజు(ఆదివారం) రూ.33 లక్షలు వచ్చాయి. అంటే సినిమా క్రమంగా పుంజుకుంది. కానీ నాల్గో రోజు గట్టి దెబ్బపడింది. సోమవారందారుణంగా పడిపోయింది. కేవలం రూ.13లక్షలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లో రూ.84లక్షలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.95లక్షలు వచ్చాయి. నాల్గు రోజుల్లో ఈ చిత్రం కోటీ కూడా దాటలేదు. మంగళవారం ఇంకా దారుణంగా ఉండబోతున్నాయని సాక్నిల్క్ సైట్‌ తెలిపిన లెక్కల ప్రకారం తెలుస్తోంది.

44
టీమ్‌ చెప్పిన లెక్కలివే

ఇదిలా ఉంటే చిత్ర బృందం చెప్పిన లెక్కల ప్రకారం ఈ మూవీ మూడు రోజుల్లో ఐదు కోట్లు రాబట్టింది. నాల్గో రోజు యాభై లక్షల నుంచి కోటి దాకా రాబట్టినట్టు టీమ్‌ చెబుతుంది. బ్రేక్‌ ఈవెన్ కూడా అయ్యిందని ప్రకటించారు. కానీ వాస్తవ లెక్కలు వేరని సాక్నిల్క్ వంటి ట్రేడ్‌ సైట్లు వెల్లడిస్తున్నాయి. మరి ఈ లెక్కన ఈ మూవీ కలెక్షన్లు కనీసం సుమంత్‌ పారితోషికాన్ని కూడా తీసుకురాలేకపోయాయని తెలుస్తోంది. ఆయన ఒక్క సినిమాకి రెండు మూడు కోట్లు తీసుకుంటారని టాక్‌. అది బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. ఈటీవీ విన్‌ వాళ్ల కోసం పారితోషికం తగ్గించుకునే చేస్తున్నారని సమాచారం. ఎంత తీసుకున్నా, కలెక్షన్లు మాత్రం ఆయన పారితోషికాన్ని కూడా తీసుకురాలేకపోయాయని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories