బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 9 లో సెకండ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు యంగ్ యాక్టర్ శ్రీనివాస్ సాయి. ఈనటుడికి అక్కినేని ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
బిగ్ బాస్ ప్రతీ సీజన్ కు ఏదో ఒక కొత్తదనం యాడ్ చేస్తున్నారు టీమ్. ఈసారి హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు గ్రూప్ ల మధ్య రణరంగం జరుగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ లో ఐదో వారం ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకోబోతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక గేమ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. ఈక్రమంలో బిగ్ బాస్ హౌస్ లోకి సెకండ్ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు యాక్టర్ శ్రీనివాస్ సాయి.
24
ఎవరీ శ్రీనివాస్ సాయి
శ్రీనివాస్ సాయి టాలీవుడ్ యంగ్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన శ్రీనివాస్ సాయి.. ఆతరువాత గోల్డొండ హైస్కూల్ సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుర్ర హీరో పలు సినిమాల్లో నటించాడు, కానీ ఆ సినిమాలేవి పెద్దగా అతనికి ఉపయోగపడలేదు. కింగ్ నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమాలో కార్తి తమ్ముడిగా నటించాడు శ్రీనివాస్ సాయి. ఆతరువాత శుభలేఖలు, వినరా సోదర వీరకుమారా వంటి సినిమాలతో హీరోగా మారినా.. కెరీర్ మాత్రం ముందుకు సాగలేదు. కొన్నాళ్లుగా సినిమాలు లేక ఇబ్బండిపడుతున్న శ్రీనివాస్ సాయి బిగ్ బాస్ ద్వారా మరోసారి పాపులారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
34
అక్కినేని ఫ్యామిలీతో సబంధం ఏంటి?
బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రీనివాస్ సాయి నాగార్జునతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఊపిరి సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన శ్రీనివాస్ సాయి, అంతకు ముందు గోల్కొండ హైస్కూల్ సినిమాలో సుమంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రెండు సూపర్ హిట్ సినిమాల్లో అక్కినేని ఫ్యామిలీ హీరోతో కలిసి నటించాడు సాయి. ఇక నాగార్జుతో సాయి మాట్లాడుతూ, '' సార్ నేను మీతో ఊపిరి సినిమాల్ నటించాను.. ఆతరువాత చాలామంది నన్ను మీరు అక్కినేని ఫ్యామిలీనా అని అడుగుతున్నారు'' అని అన్నారు.
చాలా కాలంగా సినిమాలు లేక ఇబ్బందుల్లో ఉన్నాడు యంగ్ స్టార్ శ్రీనివాస్ సాయి. హీరోగా పక్కన పెడితే, కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా రావడంలేదు. దాంతో ఎలాగైనా స్క్రీన్ పై బిజీ అవ్వాలని చూస్తున్నాడు. అటువంటి టైమ్ లోనే శ్రీనివాస్ కు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. ఈచాన్స్ ను ఉపయోగించుకుని వెండితెరపై ఛాన్స్ లు కొట్టేయాలని ప్లాన్ తో ఉన్నాడు సాయి. ఇక హౌస్‌లోకి వెళ్లే ముందు డార్క్ బ్లూ స్టోన్ సాయికి ఇచ్చారు నాగార్జున. దీంతో ఇమ్యూనిటీ పవర్ వస్తుందని చెప్పారు.. ఇది ఉపయోగించి ఎలిమినేషన్‌లో ఎవరినైనా సేవ్ చేయొచ్చు అంటూ నాగ్ చెప్పారు.