క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల అంతా కొలాప్స్.. అసలు అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య ఎవరు ?

Published : Oct 12, 2025, 08:24 PM IST

అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. రమ్య మోక్ష ఎలా ఫేమస్ అయింది ? ఆమె ఎవరు ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
13
అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య వైల్డ్ కార్డు ఎంట్రీ 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో కొత్త చాప్టర్ మొదలైంది. అక్టోబర్ 12 ఆదివారం రోజు స్పెషల్ ఎపిసోడ్ లో కొందరు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వెళ్లారు. ముందుగా హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ ఎవరో కాదు.. సోషల్ మీడియాలో మారుమోగిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య అలియాస్ రమ్య మోక్ష. ఆమె గురించి కొన్ని విషయాలు అందరికీ తెలుసు. తెలియని మరికొన్ని విషయాలు ఉన్నాయి. అలేఖ్య.. చిట్టి.. రమ్య ముగ్గురు అక్కా చెల్లెల్లు.  వీరు ముగ్గురూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. రమ్య అయితే తన ఫిట్ నెస్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది. సంపాదన కోసం అక్కా చెల్లెల్లు ముగ్గురూ పికిల్స్ బిజినెస్ ప్రారంభిచారు. వెజ్, నాన్ వెజ్ పికిల్స్ లో అన్ని రకాలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో వీరు ఫేమస్ కాబట్టి వైవిధ్యమైన ప్రొమోషన్స్ స్ట్రాటజీలు ఉపయోగించి తమ ప్రొడక్ట్స్ కి పబ్లిసిటీ తెచ్చుకున్నారు. దీనితో అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. 

23
బూతులతో వివాదం, ఆడియో లీక్ 

అంతలోనే భారీ కుదుపు ఏర్పడింది. అది వీరు చేజేతులా చేసుకున్నదే. వ్యాపారంలో కస్టమర్లని దేవుళ్లుగా భావించాలి. అప్పుడు బిజినెస్ సాఫీగా సాగుతుంది. అలా కాదని కస్టమర్స్ పైనే బూతు పురాణం అందుకుంటే పతనం తప్పదు. అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో కూడా అదే జరిగింది. ఓ కస్టమర్ పికిల్స్ ఖరీదు ఎక్కువగా ఉందని అడిగారు. దీనితో రమ్య అతడిని టార్గెట్ చేస్తూ.. పికిల్స్ కొనలేనివాడివి భార్యకి నగలు, చీరలు ఏం కొనిస్తావు ? బయటకి ఏం తీసుకెళతావ్ ? ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకో అంటూ అతడిని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రమ్యపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఎంతలా అంటే తమ పికిల్స్ బిజినెస్ ని క్లోజ్ చేసుకునేంతగా. 

33
క్షణికావేశంలో చేసిన తప్పు 

రమ్య బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తూ ఈ వివాదం గురించి ఓపెన్ అయింది. అది క్షణికావేశంలో చేసిన తప్పు అని సర్దిచెప్పుకుంది. జీవితంలో తనకి ఎదురైన మరో విషాదకర సంఘటన గురించి కూడా రమ్య మోక్ష నాగార్జునతో పంచుకుంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఓ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ మూవీ షూటింగ్ లో ఉండగా నాన్న చనిపోయారు అనే వార్త వచ్చింది. కొడైకెనాల్ లో షూటింగ్ లో ఉన్నాను. దీనితో తిరిగి వెళ్లి కళ్లారా నాన్నని చూసుకునే అవకాశం లభించలేదు. కేవలం 2 నిముషాలు మాత్రమే నాన్నని ఆఖరి చూపు చూసుకోగలిగాను అని రమ్య ఎమోషనల్ అయింది. మొత్తంగా రమ్య సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. మరి ఈ రాజమండ్రి అమ్మాయి హౌస్ లో ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories