సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్న కెజియఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి. ట్విస్ట్ ఏంటంటే..?

Published : Jul 15, 2023, 05:48 PM IST

కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ శ్రీనిథి శెట్టి. యష్ అంత ఫేమస్ అవ్వకపోయినా.. కన్నడ నాట ఓ రేంజ్ లో ఇమేజ్ సాధించింది బ్యూటీ. తాజాగా శ్రీనిథి పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నిజం ఏంటంటే..?   

PREV
16
సీక్రేట్ గా పెళ్ళి చేసుకున్న కెజియఫ్ హీరోయిన్ శ్రీనిథి శెట్టి. ట్విస్ట్ ఏంటంటే..?

కెజియఫ్ సినిమాతో బాగా ఫేమస్ అయిన వారిలో.. పాన్ ఇండియ రేంజ్ లో  హీరో  యష్ ఫేమస్ అయితే..కన్నడనాట మాత్రం యష్ తో పాటు.. హీరోయిన్  శ్రీనిధి శెట్టి కూడా బాగా ఫేమస్ అయ్యింది. . అవును కే.జి.ఎఫ్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కే.జీ.ఎఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టింది. 

26

ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి వెళ్ళిపోయారు ఈ ఇద్దరు. అయితే ఇంత రేంజ్ అందుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టికి మరోమంచి అవకాశం మాత్రం రాలేదు. అవకాశం రావడం లేదు. ఆమెకు ఇతర అవకాశాలు కూడా రావడం లేదు. తాజాగా శ్రీనిధి శెట్టి గురించి ఓన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

36

శ్రీనిథి శెట్టి  సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అంటూ నెట్టింట్లో న్యూస్ తో పాటు ఒక ఫోటో కూడా చక్కర్లు కొడుతుంది. ఇక ఆమె ఎప్పుడు పెళ్ళి చేసుకుంది.. అసలు విషయం ఏంటీ అంటే..? . శ్రీనిధి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపిస్తోంది.

46

అయితే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్ ఏంటి శ్రీనిధి శెట్టి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది గా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా.. కనీసం ఎవరికీ తెలియదు.. ఒక్క ఫోటో కూడా రిలీజ్ అవ్వలేదు అని కామెంట్లు చేస్తున్నారు. దాంతో అసలు విషయం బయటకు వచ్చింది. 

56
Image: Still from the movie

ఆమె పెట్టిన ఫోటోకు సమాధానంగా కొన్ని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.. కర్ణాటక లోని ఒక కులానికి చెందిన కొంతమంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే నుదుటన బొట్టు పెట్టుకుంటారుట.ఇది ఆచారంలో ఒక భాగమే అని టాక్. అందుకే  శ్రీనిధి శెట్టి కూడా అలా నుదుటన బొట్టు పెట్టుకుందని సమాచారం.
 

66

అంతేగాని ఆమె ఎలాంటి పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.దాంతో శ్రీనిథి శెట్టి తాను క్లారిటీ ఇవ్వకుండానే నెటిజన్లకు క్లారిటీ వచ్చేసింది. అంతే కాదు నెట్టింట్లో ఆమెను సపోర్ట్ చేస్తూ.. మంచి అవకాశాలు రావలి అని కోరకుంటున్నారు ఫ్యాన్స్. 

click me!

Recommended Stories