గ్లామరస్ హీరోయిన్ గా ప్రణీతా సుభాష్ దక్షిణాది ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో తక్కవ సినిమాలే చేసినా తన అందం, నటనతో కట్టిపడేసింది. ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’లో నటించాక మరింత క్రేజ్ ను దక్కించుకుంది.