Srinidhi Shetty: ఆ విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి సంచలన కామెంట్స్..

Published : Oct 04, 2026, 10:15 AM IST

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి ఇచ్చిన ఈ ఆన్సర్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. కేజీఎఫ్ పెయిర్ యశ్, శ్రీనిధికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి టైమ్‌లో యశ్ కంటే నానినే బెస్ట్ అంటూ షాక్ ఇచ్చింది బ్యూటీ. ఇంతకీ ఏ విషయంలోనో తెలుసా?

PREV
15
కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా క్రేజ్

'కేజీఎఫ్' సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇప్పుడు సినిమాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉంటోంది. కన్నడతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో శ్రీనిధి శెట్టి రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం కన్నడ రాకింగ్ స్టార్ యశ్, తెలుగు న్యాచురల్ స్టార్ నాని!

25
యశ్, నాని.. ఇద్దరిలో ఎక్కువగా ఎవరు నవ్విస్తారు?

ఒక మీడియా ఇంటరాక్షన్‌లో శ్రీనిధి శెట్టికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'యశ్, నాని.. ఈ ఇద్దరిలో మిమ్మల్ని ఎక్కువగా ఎవరు నవ్విస్తారు?' అని యాంకర్ అడిగారు. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న శ్రీనిధి, తన కెరీర్‌లో యశ్, నాని ఇద్దరికీ స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పింది.

శ్రీనిధి శెట్టి సినీ జర్నీలో యశ్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 'కేజీఎఫ్' సినిమాలో యశ్ సరసన నటించడం వల్లే ఆమెకు కన్నడ ఇండస్ట్రీలో అంత పెద్ద గుర్తింపు వచ్చింది. మరోవైపు తెలుగులో నానితో కలిసి పనిచేసే ఛాన్స్ కూడా శ్రీనిధికి దక్కింది. అందుకే ఈ ఇద్దరు హీరోలు తనకు చాలా స్పెషల్ అని ఆమె చెప్పుకొచ్చింది.

35
యశ్ కొంచెం రిజర్వ్‌డ్‌...

కానీ ఇద్దరి క్యారెక్టర్లను పోల్చి చూసినప్పుడు శ్రీనిధికి ఒక క్లియర్ డిఫరెన్స్ కనిపించిందట. యశ్ గురించి మాట్లాడుతూ.. ఆయన కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉంటారని చెప్పింది. అవసరమైనంత వరకే మాట్లాడే యశ్, బయటకు సీరియస్‌గా కనిపించినా సెట్‌లో మాత్రం తనదైన స్టైల్‌లో ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేస్తారని శ్రీనిధి తెలిపింది.

45
యశ్ కంటే నానినే బెస్ట్...

ఇక నాని విషయానికి వస్తే స్టోరీ వేరేలా ఉంటుంది! నాని చాలా ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తి అని శ్రీనిధి చెప్పింది. సెట్‌లో జోక్స్ వేస్తూ, తోటి నటీనటుల కాళ్లు లాగుతూ అందరినీ నవ్విస్తుంటారట. నాని క్యారెక్టర్ తన మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని శ్రీనిధి అభిప్రాయపడింది.

మరి ఫైనల్‌గా యశ్, నాని.. ఈ ఇద్దరిలో శ్రీనిధిని ఎక్కువగా నవ్వించేది ఎవరు? ఈ ప్రశ్నకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నాని పేరే చెప్పేసింది ఈ బ్యూటీ. నవ్వించే విషయంలో యశ్ కంటే నానినే బెస్ట్ అని శ్రీనిధి శెట్టి క్లారిటీ ఇచ్చేసింది.

55
సోషల్ మీడియాలో చర్చ

శ్రీనిధి ఇచ్చిన ఈ ఆన్సర్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. 'కేజీఎఫ్' హిట్ పెయిర్ యశ్-శ్రీనిధికి ఫ్యాన్స్ మధ్య మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి టైమ్‌లో యశ్ కంటే నానినే తనను ఎక్కువగా నవ్విస్తాడని శ్రీనిధి చెప్పడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. అయితే, ఇది కేవలం నవ్వించే విషయానికి సంబంధించిన మాట మాత్రమే అని ఎవరైనా ఎలా మర్చిపోగలరు చెప్పండి!

Read more Photos on
click me!

Recommended Stories