Srikanth: బుల్లితెర స్టార్ సెలబ్రిటీ సుడిగాలి సుధీర్ కు సీనియర్ హీరో శ్రీకాంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. నీ హద్దుల్లో నువ్వు ఉండు.. ఎలా కనిపిస్తున్నానంటూ.. గట్టిగా ఇచ్చిపడేశాడు. శ్రీకాంత్ ఎందుకు అంత సీరియస్ అయ్యాడు? కారణం ఏంటి?
టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్. ఈ ఫ్యామిలీ హ్యాండ్సమ్ హీరోకి మహిళా ప్రేక్షకుల నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. 2000ల ప్రారంభంలో శ్రీకాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. హీరోగా మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్‌గా టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా దూసుకుపోతున్నాడు. ఈమధ్యకాలంలో సహాయ పాత్రలు, విలన్ రోల్స్ లో కూడా అలరించిన శ్రీకాంత్ తాజాగా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఈవెంట్స్ కు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీకాంత్ జడ్జిగా ఉన్న షోలో సుడిగాలి సుధీర్ తో జరిగిన సంఘటన వైరల్ అవుతోంది.
24
శ్రీకాంత్ - సుధీర్ స్పెషల్ షో..
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మల్టీ టాలెంట్ స్టార్ సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer). ప్రస్తుతం ఆయన జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్ సీజన్ 9'కి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో నటుడు హీరో శ్రీకాంత్, రోజా మరియు దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇటీవల జీ తెలుగు విడుదల చేసిన ఒక వీడియో ప్రోమోలో శ్రీకాంత్ సుధీర్‌పై తీవ్రంగా విరుచుకుపడటం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
34
సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శ్రీకాంత్.
ఈ వీడియోలో, శ్రీకాంత్ స్టేజీ పైకి రాగానే ఆయనను సుధీర్ ఆహ్వానిస్తూ.. "ఏంటన్నా అసలు.. మీరు ఎప్పుడూ చిన్న పిల్లల నవ్వుతో కనిపిస్తారు" అంటూ చనువుగా మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దాంతో ఒక్కసారిగా కోపానికి గురైన సీనియర్ నటుడు శ్రీకాంత్, సుధీర్ మాటలను అడ్డుకుంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "హేయ్ ఆపు! నీకు నేను హీరోలా కనిపించడం లేదా? తగ్గూ.. కొంచెం తగ్గూ.. అతి చేయకు. నీ పరిమితుల్లో (హద్దుల్లో) నువ్వు ఉండు" అంటూ హెచ్చరించారు. ఇన్నాళ్లూ మొహమాటంతో ఊరుకున్నానని, బయట తనకు ఉన్న గౌరవం తనకే ఉందని, ఇలాంటి ప్రవర్తన ఉంటే తనకు ఈ షో వద్దని అసహనం వ్యక్తం చేశారు. దీనికి సుధీర్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తూ.. "అన్నా.. ప్రోమో కోసం చేస్తున్నారా?" అని అడగ్గా, శ్రీకాంత్ మరింత సీరియస్ అవుతూ "ప్రతిదాన్నీ కమర్షియల్‌గా ఎందుకు చూస్తావ్?" అని గద్దించారు.
అయితే, వీడియో చివర్లో శ్రీకాంత్ నవ్వుతూ "ఇది అసలైన ప్రోమో అంటే" అని అనడంతో అది ఒక షాకింగ్ ప్రాంక్ అని స్పష్టమైంది. ప్రోమోలో కట్ చేసిన తీరు, శ్రీకాంత్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ , చాలా నేచురల్ గా ఉండటంతో.. నిజంగానే సుధీర్ పై శ్రీకాంత్ మండిపడుతున్నాడని అంతా అనుకున్నారు. సుధీర్‌కు శ్రీకాంత్ వార్నింగ్ ఇచ్చారని షాక్ అయ్యారు. టీఆర్పీ రేటింగ్‌ల కోసం చేసే ఇలాంటి ప్రాంక్‌లు సుధీర్ ఇమేజ్‌కు ఇబ్బందిగా మారుతున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం షో ప్రమోషన్ కోసం ఇది బాగా వర్కవుట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది.