చిరంజీవి `ఖైదీ` సినిమా చూసి ఇంటి నుంచి పారిపోయిన శ్రీకాంత్‌.. ఈ అవమానంతో రాత్రంతా ఏడుస్తూనే

Published : Nov 05, 2025, 07:49 AM IST

చిరంజీవి ఖైదీ సినిమాని చూసి హీరో అవ్వాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి మద్రాస్‌ పారిపోయిన హీరో ఎవరో తెలుసా? దారుణమైన అవమానాలు ఫేస్‌ చేసి చివరకు ఆ హీరో చేసిన పని ఇదే.   

PREV
15
చిరంజీవి `ఖైదీ`ని చూసి ఇన్‌స్పైర్‌ అయిన హీరో

సినిమాల్లో రాణించాలంటే సినిమాల్లో మాదిరి కష్టాలుంటాయి. చాలా అవమానాలుంటాయి. ఎవరూ ఎంకరేజ్‌ చేయరు. కనీసం ప్రొడక్షన్‌ ఆఫీస్‌ గేట్‌ కూడా దాటలేని పరిస్థితి ఉంటుంది. స్టూడియోస్‌లోనూ అలాంటి పరిస్థితినే ఫేస్‌ చేయాలి. చాలా రోజులు స్ట్రగుల్స్ తప్పవు. ఈ క్రమంలో ఎవరో ఒకరు గుర్తించడం, ఛాన్స్ ఇవ్వడం, తనని తాను నిరూపించుకునేందుకు చాలా స్ట్రగుల్ పడ్డ తర్వాత కొన్నేళ్లకు గానీ సినిమా అవకాశాలు రావు. ప్రారంభం నుంచి ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న 70శాతం హీరో, హీరోయిన్‌, దర్శకులు, ఆర్టిస్ట్ ల, టెక్నీషియన్ల పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇందులో స్టార్‌ వారసులు తప్ప, మిగిలిన వారందరిదీ ఒకే  పరిస్థితి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా చిరంజీవి `ఖైదీ` సినిమా చూసి హీరో అవ్వాలని చెప్పి ఇంటర్మీడియట్‌లో ఇంటి నుంచి పారిపోయి ఓ హీరో దారుణమైన అవమానాలు ఫేస్‌ చేశాడు.  

25
హీరో అవ్వాలని ఇంటి నుంచి పారిపోయిన శ్రీకాంత్‌

చిరంజీవి మూవీస్‌ చూసి, సినిమాల్లోకి రావాలని, హీరో కావాలని నిర్ణయించుకుని ఇంటి నుంచి పారిపోయిన స్టార్‌ ఎవరో కాదు శ్రీకాంత్‌. వీరిది తెలుగు ఫ్యామిలీ, వారి పేరెంట్స్ కర్నాటకకి వలస వెళ్లారు. దీంతో శ్రీకాంత్ అక్కడే పెరిగారు. చిరంజీవి `ఖైదీ` సినిమా చూసి హీరో కావాలని నిర్ణయించుకున్నారట. టెంన్త్ వరకు తెలుగు మీడియంలో చదివిన శ్రీకాంత్‌ ఇంటర్మీడియట్‌ మాత్రం కర్నాటక యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ మీడియంలో చేరారు. ఇంగ్లీష్‌ అర్థం కాలేదు. దీంతో చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడే `ఖైదీ` సినిమా వచ్చింది. అది చూసి హీరో అవ్వాలని బలంగా నిర్ణయించుకున్నారు. దీంతో ఇంటికెళ్లి నాలుగు వేల రూపాయలు డబ్బులు తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లిపోయారు. హీరో అవుతానని ఫ్రెండ్స్ కి మాత్రం చెప్పారట. మద్రాస్‌ వెళ్లి బస్టాండ్‌ పక్కన చిన్న అద్దె రూమ్ తీసుకున్నారు. మరుసటి రోజు మెరీనా బీచ్‌కి వెళ్లిపోయారు.

35
ఏవీయం స్టూడియోలో అవమానం

మెరీనా బీచ్‌లో సినిమా షూటింగ్‌లు అవుతాయని భావించారు. కానీ అప్పుడు జరగడం లేదు. ఆ తర్వాత నెక్ట్స్ డే ఏవీఎం స్టూడియోకి వెళ్లారు. అక్కడ గేట్‌ వద్ద వాచ్‌ మెన్‌ ఆపేశాడు. లేదు లేదు అంటూ వెళ్లగొట్టాడట. దీంతో కాసేపు అలానే వెయిట్‌ చేశారు. స్టూడియోలోకి పెద్ద పెద్ద కార్లు వెళ్తున్నాయి. వాటిని జనాలంతా అలా చూస్తున్నారు. అందులో తానూ కూడా ఒకడిగా అవన్నీ చూశారట. లోపలికి వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేదు. వాచ్‌మెన్‌ కాళ్లవేళ్లా పడ్డా కూడా కనికరించలేదట. దీంతో చాలా బాధపడిపోయారట శ్రీకాంత్‌. అక్కడ అందరిలో దారుణమైన అవమానం ఫేస్‌ చేశారట. దీంతో రూమ్‌కి వచ్చి ఆ రోజు రాత్రి మొత్తం ఏడుస్తూనే ఉన్నారట. 

45
`పీపుల్స్ ఎన్‌కౌంటర్‌` మూవీతో నటుడిగా ఎంట్రీ

మరుసటి రోజు వాళ్ల అక్కకి ఫోన్‌ చేస్తే వాళ్లూ ఏడుస్తూనే ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ కూడా నువ్వు ఇలా వెళ్లిపోయినందుకు ఏడుస్తున్నారని చెప్పారు. దీంతో మళ్లీ బ్యాగ్‌ సర్దుకొని ఇంటికెళ్లిపోయారు శ్రీకాంత్‌. ఆయన రావడంతోనే పేరెంట్స్ పట్టుకుని ఏడ్చేశారట. పక్క వాళ్లు సూటిపోటి మాటలు అన్నారట. చాలా బాధపడినట్టు తెలిపారు శ్రీకాంత్‌. యాంకర్‌ ప్రదీప్‌ నిర్వహించి `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` షోలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. అనంతరం డిగ్రీ చేస్తే సినిమాల్లోకి పంపిస్తామంటే, పేరెంట్స్ కోరిక మేరకు డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత అడయార్‌ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రయత్నించారు. కానీ ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత హైదరాబాద్‌లో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఏడాది పాటు ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లోకి వెళ్లారు శ్రీకాంత్‌. `పీపుల్స్ ఎన్‌కౌంటర్‌` చిత్రంతో నటుడిగా మారారు. ఇందులో ఆయన నక్సలైట్‌గా నటించడం విశేషం.

55
చిరంజీవితో కలిసి చేసిన సినిమాలు

`ఆమె`సినిమాతో బ్రేక్‌ అందుకున్నారు శ్రీకాంత్‌. ఆ తర్వాత `తాజ్‌ మహల్‌`, `పెళ్లిసందడి`తో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. స్టార్‌ అయిపోయారు. `వినోదం`, `తాళి`, `ఎగిరే పావురమా`, `ఆహ్వానం`, `తారక రాముడు`, `మా నాన్నకి పెళ్లి`, `ఉయ్యాల`, `కన్యాదానం`, `సుప్రభాతం`, `శుభలేఖలు`, `పిల్ల నచ్చింది`, `మనసులో మాట`, `ప్రేయసి రావే`, `పంచదార చిలక`, `క్షేమంగా వెళ్లి లాభంగా రండి`, `చాలా బాగుంది`, `నిన్నే ప్రేమిస్తా`, `అమ్మో ఒకటో తారీఖు`, `దేవుళ్లు`, `తిరుమల తిరుపతి వెంకటేశా`, `ఖడ్గం`, `స్వరాభిషేకం`, `రాధాగోపాళం`, `సంక్రాంతి`, `ఆపరేషన్‌ దుర్యోధన`, `మహాత్మ` వంటి చిత్రాలతో మెప్పించారు. స్టార్‌ హీరోగా రాణించారు. ఇప్పుడు క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుని బిజీగా ఉంటున్నారు శ్రీకాంత్‌. ప్రారంభంలో కొన్ని విలన్‌రోల్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే ఆయన చిరంజీవితో `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌`, `శంకర్‌ దాదా జిందాబాద్‌` చిత్రాల్లో నటించారు. అంతేకాదు ఇప్పుడు చిరంజీవికి అత్యంత ఇష్టమైన హీరో శ్రీకాంత్‌. సొంత తమ్ముడిలా శ్రీకాంత్ ని భావిస్తారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories