చిరంజీవి మీద పిచ్చి ప్రేమతో.. పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

Published : Nov 28, 2025, 05:11 PM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని ప్రాణంగా ప్రేమించే అభిమానులు ఉన్నారు. వారిలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మెగాస్టార్ సినిమా కోసం పోటీపడి పోలీసులు దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

PREV
14
మెగాస్టార్ చిరంజీవికి సెలబ్రిటీ అభిమానులు

టాలీవుడ్ లో సెలబ్రిటీ అభిమానులు ఎక్కువగా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన జీవితం ఆదర్శంగా తీసుకుని, తెరపై చిరంజీవి డాన్స్, స్టైల్ ను చూసి సినిమాల్లోకి వచ్చినవారు ఎందరో ఉన్నారు. వారు ప్రస్తుతం ఎంత పెద్ద స్టార్స్ గా ఉన్నా కానీ.. చిరంజీవి అంటే అదే భక్తి చూపిస్తుంటారు. పలు సందర్భాల్లో తమ అభిమాన నటుడి గురించి మాట్లాడుతూనే ఉంటారు. చిరంజీవిని ఆరాధించే సెలబ్రిటీ అభిమానుల్లో హీరో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. అన్నయ్య అంటూ చిరుని ఎంతో అప్యాయంగా పిలిచే శ్రీకాంత్.. కాలేజీ రోజుల నుంచి మెగా హీరో అంటే పిచ్చి ప్రేమ పెంచుకున్నారు.

24
ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే..

హీరో శ్రీకాంత్ కు ఒక అలవాటు ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచే.. ఆయన చిరంజీవి సినిమా రిలీజ్ అయితే మిస్ అవ్వకుండా చూసేవాడు. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో లో తన అభిమాన హీరో సినిమా చూడాల్సిందే. కాలేజీలో ఉన్నప్పుడు మాత్రమే కాదు.. హీరో అయిన తరువాత, స్టార్ హీరోగా ఎదిగిన తరువాత కూడా శ్రీకాంత్ ఇదే ఫాలో అవుతున్నాడు. ఇప్పటికీ ఆయన సినిమా రిలీజ్ అయితే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్తాడట శ్రీకాంత్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. అంతే కాదు మెగాస్టార్ సినిమా చూడటానికి వెళ్లి.. పోలీసు దెబ్బలు తిన్న సందర్భాన్ని కూడా శ్రీకాంత్ వెల్లడించాడు.

34
పోలీసులతో దెబ్బలు తిన్న శ్రీకాంత్..

శ్రీకాంత్ మాట్లాడుతూ... '' వేట (1986) సినిమా రిలీజ్ అప్పుడు నేను విజయవాడలో ఉన్నాను. మార్నింగ్ 4 నుంచి 5 మధ్యలో షోపడిపోయేది. అప్పుడు టికెట్లు దొరుకుతాయో లేదో అని..నేను ఉదయం 3 గంటలకే వెళ్లి క్యూలో నిల్చున్నాను. ఆతరువాత ఏం చేయాలో తెలియదు.. అంతకంతకు జనాలు పెరిగిపోతున్నారు... కొట్టుకుంటున్నారు, నెట్టుకుంటున్నారు. జనం భారీగా వచ్చేశారు. ఇక సరిగ్గా 4 గంటలకు పోలీసులు రంగంలోకి దిగారు.. అక్కడ బాగా రప్చర్ అయిపోతుందని చెప్పి.. లాఠీ ఛార్జ్ చేశారు. జనాలను ఉరికించి కొట్టారు. అప్పుడు నేను కూడా భాగా దెబ్బలు తిన్నాను. అయినా సరే ఎలాగో టికెట్ మాత్రం సాధించి ఆసినిమా చూశాను. ఇదే కాదు ఖైదీ సినిమా నుంచి అన్నయ్య సినిమా రిలీజ్ అవుతుందంటే.. ఫస్ట్ డే మార్నింగ్ షో చూడాల్సిందే. '' అని శ్రీకాంత్ అన్నారు.

44
విలన్ గా ఎంట్రీ ఇచ్చి..

టాలీవుడ్ లో శ్రీకాంత్ కు హీరోగా మంచి పేరు ఉంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ శ్రీకాంత్ ను బాగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అబ్బాయిగారు లాంటి సినిమాల్లో విలన్ గా నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. ఆతరువాత కాలంలో హీరోగా మారి మంచిమంచి సినిమాలు చేశాడు. శ్రీకాంత్ కమర్షియల్ గా ఎక్కువ ఆలోచించలేదు. కథా బలం ఉన్న సినిమాలు చేసి.. ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ను సాధించాడు. శ్రీకాంత్ సినిమా రిలీజ్ అయ్యిందంటే.. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లి చూసి ఎంజాయ్ చేసేవారు. 50 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ అదే గ్లామర్ ను మెయింటేన్ చేస్తున్నాడు శ్రీకాంత్. ఈ మధ్య హీరోగా సినిమాలు మానేసి.. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories