హీరోయిన్‌గా యావరేజ్, మా ఇంటికి కోడలుగా వస్తే బాగుండు.. యాంకర్‌ సుమ గురించి చెబుతూ మామ కన్నీళ్లు

Published : Sep 19, 2025, 08:09 PM IST

యాంకర్‌ సుమ చేసిన పని తలుచుకుని దేవదాస్‌ కనకాల కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను కోరుకున్నదే ఆలస్యం ఆ భగవంతుడు వరాలు ఇచ్చాడని చెప్పి ఎమోషనల్‌ అయ్యాడు. సుమ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. 

PREV
15
స్టార్‌ యాంకర్‌గా రాణిస్తోన్న సుమ కనకాల

సుమ కనకాల.. యాంకరింగ్‌లో ఒక సునామీ. తెలుగు బుల్లితెరని రెండు దశాబ్దాలుగా శాసిస్తోంది యాంకర్‌. తీరిక లేకుండా యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంది. ఇంటిళ్లిపాదిని అలరించింది. `స్టార్ మహిళా`‌ అనే షోని దాదాపు మూడు వేలకుపైగా ఎపిసోడ్లు నిర్వహించి రికార్డు సృష్టించింది. బుల్లితెరపై అత్యధికంగా టెలికాస్ట్ అయిన షోగా నిలిపింది. మహిళా షోస్‌, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్స్ షో చేస్తూ ఆకట్టుకుంది. అంతేకాదు సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలు ఇలా ఏదైనా తనదైన యాంకరింగ్‌తో దడదడలాడిస్తున్నారు యాంకర్‌ సుమ. ఇప్పటికీ టాప్‌ యాంకర్‌గానే రాణిస్తోంది.

25
రాజీవ్‌ కనకాలను పెళ్లి చేసుకున్న యాంకర్‌ సుమ

ఇదిలా ఉంటే కేరళాకి చెందిన యాంకర్‌ సుమ.. హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యింది. ఆమె నిజానికి హీరోయిన్‌గా రాణించాలని సినిమాల్లోకి వచ్చింది. ప్రారంభంలో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. అవి అంతంత మాత్రంగానే అలరించాయి. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేసింది. నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు. యాంకర్‌గా ప్రయత్నించింది. సక్సెస్‌ అయ్యింది. ఇక సినిమాలు మానేసి పూర్తిగా బుల్లితెరపైనే ఫోకస్‌ పెట్టింది. అయితే యాంకర్‌ సుమ.. నటుడు రాజీవ్‌ కనకాలని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు, యాక్టింగ్‌ ట్రైనర్‌ దేవదాస్‌ కనకాల కుమారుడు కావడం విశేషం. అలా ఈ ఇద్దరు 1999లోనే పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వెనక వీరి మధ్య ప్రేమ కూడా ఉంది. ఈ ఇద్దరు కలిసి సినిమాలు, సీరియల్స్ చేశారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది పెళ్లి వరకు వెళ్లింది.

35
యాంకర్‌ సుమ గురించి మామ దేవదాస్‌ కనకాల

సుమ తమ కుటుంబంలోకి రావడం పట్ల దేవదాస్‌ కనకాల ఓపెన్‌ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె తమ అదృష్టంగా చెప్పుకొచ్చారు. సుమ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. సుమ యాంకర్‌గా వ్యవహరిస్తున్న `స్టార్‌ మహిళ`షో 3181వ ఎపిసోడ్‌ సందర్భంగా మామని ఆహ్వానించింది సుమ. తన భర్త రాజీవ్‌ కనకాల, అలాగే కొడుకు రోషన్‌, కూతురు మనస్విని కూడా ఇందులో పాల్గొని సందడి చేశారు. ఇలా సుమ కుటుంబం మొత్తం సందడి చేసింది. ఈ సందర్భంగా దేవదాస్‌ కనకాల మాట్లాడుతూ, స్టార్ మహిళ ఇన్ని ఎపిసోడ్లు చేయడం మామూలు విషయం కాదని, అందుకు సుమకి అభినందనలు తెలిపారు.

45
సుమ చేసిన పని చెబుతూ మామ కన్నీళ్లు

ఇంకా ఆయన చెబుతూ, సుమలో ఉన్న గొప్పలక్షణం ఏంటంటే ఆమెకి విసుగు, విరామం లేకుండా ఇన్ని ఎపిసోడ్లు చేసింది. చేసిందే చేస్తూ, ఆ స్టూడియో నుంచి ఈ స్టూడియోకి తిరుగుతూ, మరోవైపు పిల్లల్ని చూసుకుంటూ, అదే సమయంలో కుటుంబాన్ని చూసుకుంది. ఇంతకాలం తన ఫ్యామిలీని నడిపింది. మమ్మల్ని తన వెంట తీసుకెళ్లింది. కుటుంబాన్ని కాపాడుకుంది. నేను `మేఘమాల` అనే సీరియల్‌ చేశాను. సుమ హీరోయిన్‌గా చేసింది. సాదాసాధాగా ఉందయ్య ఆడపిల్ల అన్నారు. అప్పుడే ఇలాంటి అమ్మాయి ఇంట్లోకి వస్తే బాగుండు అనుకున్నా. ఆ తర్వాత అదే జరిగింది. అనుకోగానే భగవంతుడు వరాలు ఇవ్వడమంటే ఇదేనేమో` అని షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు దేవదాస్‌ కనకాల. అంతేకాదు ఆర్టిస్ట్ గా విసిగించదలుచుకోలేదని చెప్పిందని చెప్పి మళ్లీ ఎమోషనల్‌ అయ్యారు. ఆయనతోపాటు పక్కనే ఉన్న రాజీవ్‌ కనకాల హృదయం బరువెక్కింది. కానీ సుమ కనకాల కన్నీళ్లు పెట్టుకుంది.

55
మామ రూపొందించిన `మేఘమాల` సీరియల్‌లో హీరోయిన్‌గా సుమ

దేవదాస్‌ కనకాల రూపొందించిన `మేఘమాల` సీరియల్‌లో రాజీవ్‌ కనకాల, సుమ కనకాల జంటగా నటించారు. అక్కడే ఈ ఇద్దరి మధ్య ప్రేమకు భీజం పడింది. అది పెళ్లి వరకు వెళ్లింది. ఇక దేవదాస్‌ కనకాల 2019లో కన్నుమూశారు. ప్రస్తుతం రాజీవ్‌ కనకాల నటుడిగా రాణిస్తున్నారు. మరోవైపు యాంకర్‌ సుమ ఇప్పుడు `సుమ అడ్డా` షో చేస్తోంది. ఇంకోవైపు సొంతంగా రీల్స్, వీడియోస్‌ చేస్తూ అలరిస్తోంది. ఆ మధ్య `జయమ్మ పంచాయతీ` అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. సుమ కొడుకు రోషన్‌ ఆ మధ్య `బబ్లూగమ్‌` మూవీతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories