ఈ సంఘటనల తర్వాత, శ్రీదేవి మిథున్ తో వివాహాన్ని రద్దు చేసుకుని, నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్. అయితే, శ్రీదేవి, బోనీ కపూర్ వివాహం కూడా వివాదాస్పదమైంది.
ఎందుకంటే అతను తన మొదటి భార్య మోనా షౌరీ, వారి పిల్లలు అర్జున్, అన్షుల కపూర్ లను విడిచిపెట్టి శ్రీదేవితో వెళ్లిపోయాడు. ఈ నిర్ణయం అప్పట్లో సంచలనంగా మారింది. బాలీవుడ్ లో అటు , మీడియాలో కూడా పెద్ద చర్చకు దారి తీసింది.