ఇక ఆయనకు కూడా ఇండస్ట్రీలో కొన్ని ఎఫైర్స్ ఉన్నట్టు ఇండస్ట్రీలో టాక్ ఉంది.. అది తరువాత సంగతి కాని..శోభన్ బాబు మాత్రం షూటింగ్ ను పర్సనల్ లైఫ్ ను దూరంగా ఉంచేవారట. అందుకే తన పిల్లలు ఎవరినీ.. సినిమా వాసనలు లేకుండా.. పెంచారు. తాను సంపాదించిన సొమ్ములో చాలా వరకూ ఇన్వెస్ట్ చేశారు.
రియల్ ఎస్టైట్ వ్యాపారాన్ని సక్సెస్ ఫుల్ గా నడిపి.. కోట్లు కూడబెట్టారు. తన పిల్లలు కూడా వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహించారు శోభన్ బాబు. ఇక శోభన్ బాబు సినిమా వాళ్లను ఇంటికి భోజనానికి పిలవడం చాలా తక్కువట.
ఆయనకు బాగా నచ్చి.. క్లోజ్ గా ఉండేవరారు మాత్రమే.. అందులో కూడా చాలా తక్కువ మంది మాత్రమే శోభన్ బాబు ఇంటికి వెళ్ళేవారట.. ఆయన పిలవడం కూడా అంతే పిలిచేవారట. ఇక ఈక్రమంలో శోభన్ బాబు ఇద్దరు కమెడియన్స్ ను మాత్రమే తన కెరీర్ లో భోజనానికి పిలిచారట.
Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..?