సుధీర్‌ బాబు `మా నాన్న సూపర్‌ హీరో` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Oct 10, 2024, 9:40 PM IST

సుధీర్‌ బాబు సక్సెస్‌ కోసం ఫైట్‌ చేస్తున్నాడు. తాజాగా ఆయన `మా నాన్న సూపర్‌ హీరో` సినిమా చేశాడు. ఈ మూవీ దసరా స్పెషల్‌గా శుక్రవారం(అక్టోబర్‌ 11)న విడుదలవుతుంది. దీన్ని ముందుగా ప్రీమియర్స్‌ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 
 

సుధీర్‌బాబుకి చాలా కాలంగా హిట్లు లేవు. గత చిత్రం `హరోం హర` చిత్రంతో ఫర్వాలేదనిపించాడు. ఈ మూవీ పెద్ద హిట్‌ కాదు, అలాగని ఫ్లాప్‌గానూ చెప్పలేదు. సుధీర్‌బాబుకి రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. అనంతరం ఇప్పుడు ఆయన `మా నాన్న సూపర్‌ హీరో` అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. అభిలాష్‌ కంకర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధీర్‌బాబుకి జోడీగా ఆర్ణ హీరోయిన్‌గా నటించింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

షాయాజీ షిండే, సాయిచంద్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అని చిన్న పాత్రలో మెరిసింది. కామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్, వీ సెల్యులాయిడ్స్ పతాకాలపై సునీల్‌ బలుసు నిర్మించారు. దసరా కానుకగా ఈ నెల 11న ఈ మూవీ విడుదల కాబోతుంది. ముందుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషన్స్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా ఉందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
జానీ(సుధీర్‌బాబు) ఒక అనాథ. తండ్రి ప్రసాద్‌(సాయిచంద్‌) చిన్నప్పుడే అనాథశ్రమంలో వదిలేస్తాడు. తను లారీ డ్రైవర్‌ ఉద్యోగం కోసం అని వెళ్లగా గంజాయి కేసులో ఇరుక్కుని 25ఏళ్ల జైలుకి వెళ్తాడు.  ఆ అనాథాశ్రమం నుంచి పిల్లలు లేని శ్రీనివాస్‌(షాయాజీ షిండే) జానీని దత్తత తీసుకుని పెంచుకుంటాడు. ఆయన స్టాక్‌ మార్కెట్‌లో పనిచేస్తుంటాడు. జానీని దత్తత తీసుకున్న తర్వాత నుంచి ఆయన పతనం స్టార్ట్ అవుతుంది.

అంతకు ముందు పెద్ద కంపెనీలో మంచి పొజీషియన్‌లో ఉన్న శ్రీనివాస్‌ క్రమంగా లాస్‌ అవుతుంటాడు. చాలా మందితో స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెట్టించి అవి లాస్‌కావడంతో తాను చెల్లించాల్సిన పరిస్థితి. అయితే తండ్రిపై ఉన్న ప్రేమతో జాని ఆ అప్పులన్నీ తీర్చుకుంటూ వస్తాడు. కానీ ఓ సారి గట్టిగా దొరికిపోతాడు శ్రీనివాస్‌. ఓ లీడర్‌ తో ఎనభై లక్షలకుపైగా షేర్‌ మార్కెట్‌లో పెట్టిస్తాడు, కానీ ఆ సమయంలో మార్కెట్‌ దారుణంగా పడిపోతుంది.

దీంతో ఆ లీడర్‌ శ్రీనివాస్‌పై ఛీటింగ్‌ కేసు పెట్టగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చితక్కొడుతుంటారు. ఈ విషయం తెలిసి జానీ తండ్రిని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. తండ్రిని వదిలేయాలంటే కోటీ రూపాయలు కట్టాలని చెప్పడంతో ఆ డబ్బుల కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు. కట్‌ చేస్తే జైలు నుంచి విడుదలైన ప్రసాద్‌ తన కొడుకు కోసం వెతుకుతుంటాడు. అతని పేరు కూడా తెలియకపోవడంతో ఎలా వెతకాలో కూడా అర్థం కాక బాధపడుతుంటాడు.

ప్రసాద్‌ తన కొడుకు కోసం లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. ఇలా ఎన్నో టికెట్లు కొంటాడు. ఎప్పుడూ కలిసి రాదు, కానీ ఈ సారి ఆయనకు కోటీన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ అమౌంట్‌ తీసుకోవడానికి కేరళాకి తనకు సాయం చేసే వ్యక్తితో కలిసి వెళ్తాడు. అతను దొంగ మధ్యలోనే పోలీసులు అతన్ని పట్టుకుపోతారు. దీంతో మరింత కుంగిపోతాడు ప్రసాద్. బస్సులో ప్రయాణిస్తూ పడిపోవడంతో అదే బస్సులో ప్రయాణిస్తున్న జానీ చూసి ఆసుపత్రిలో చేర్పిస్తాడు.

స్పృహలోకి వచ్చాక తనకు సాయం చేయాలని ఆ లాటరీ గురించి చెబుతాడు ప్రసాద్‌. అది విని ఆ అమౌంట్‌ తన తండ్రిని విడిపించడానికి ఉపయోగపడతాయనే స్వార్థంతో ప్రసాద్‌తో కేరళాకి వెళ్తాడు జానీ. మరి ఈ జర్నీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ప్రసాదే తన సొంత నాన్న అని జానీకి ఎప్పుడు తెలిసింది? తన పెంపుడు నాన్నని కాపాడుకోవడం కోసం సొంత నాన్ననే జానీ మోసం చేశాడా? వీళ్లు అసలు కలుసుకున్నారా? లేదా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. 
 

Latest Videos


విశ్లేషణః 
మదర్‌ సెంటిమెంట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. చాలా వరకు ఆడియెన్స్ ఆదరణ పొందాయి. కానీ తండ్రి ఎమోషన్స్ తో చాలా తక్కువగా వస్తుంటాయి. నిజానికి ఫాదర్ అండ్‌ సన్‌ రిలేషన్‌లో చాలా డెప్త్ ఉంటుంది. కానీ అది బయటకు కనిపించదు. ప్రదర్శించేలా ఉండదు. కొడుకు అంటే తండ్రికి ఎంతో ఇష్టం, కానీ దాన్ని చూపించలేదు. బాధ్యతలు, కుటుంబ బరువు మోయడంతోనే అతని జీవితం సరిపోతుంది.

అందుకే తండ్రి ప్రేమ బయటకు కనిపించదు, వస్తువుల రూపంలోనో, పిల్లలు అడిగింది కోనివ్వడంలోనో, బాగా చదివించడంలోనో ఆ ప్రేమ కనిపిస్తుంటుంది. అయితే తండ్రి కోసం కొడుకు పాడే పాట్లు, తండ్రిపై కొడుక్కి ఉన్న ప్రేమకి ప్రతిబింబింగా `మా నాన్న సూపర్‌ హీరో` సినిమాని రూపొందించారు. తండ్రి తనని ఎంత అసహ్యించుకున్నా కొడుకుగా దాన్ని పట్టించుకోకుండా దత్తత తీసుకుని తనకు లైఫ్‌ ఇచ్చాడనే ప్రేమ కొత్తగా ఉంది. ఈ సినిమాలో తండ్రికొడుకుల రిలేషన్‌ భిన్నమైనది. అదే ఈ మూవీలో కొత్తదనం.

ఓ వైపు పెంచిన తండ్రిపై కొడుక్కి ఉన్న ప్రేమ, మరోవైపు దూరమైన సొంత కొడుకుని వెతుకుతూ, ఎప్పటికైనా దొరుకుతాడనే ఆశతో బతుకుతున్న మరో తండ్రి ప్రేమకి, ఈ రెండింటి మధ్య సంఘర్షణకి ప్రతిబింబం `మా నాన్న సూపర్‌ హీరో`మూవీ. కథ పరంగా చాలా భావోద్వేగాలతో కూడిన కథ. అదే ఎమోషనల్‌గా మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు.  
 

సినిమాగా చూసినప్పుడు ఫస్టాఫ్‌లో సాయిచంద్‌ తన కొడుకు పుట్టగానే భార్య చనిపోవడంతో కొడుకుని తనే చూసుకోవాల్సి వస్తుంది. కానీ తన పేదరికం కారణం కనీసం పాల డబ్బాలు కూడా కొనలేని స్థితి. డ్రైవర్‌గా చేసే అతను, డ్రైవర్‌గా ఓ ట్రిప్‌ కి వెళ్తే జాబ్‌ గ్యారంటీ అని చెప్పడంతో కొడుకుని బాగా చూసుకోవచ్చు అని, కొన్ని రోజులు అనాథశ్రమంలో ఉంచి వెళ్తాడు. కానీ తాను గంజా కేసులో ఇరికిపోతాడని తెలియదు.

జైలుకి వెళ్లినా కొడుకు పరిస్థితేంటి? తాను ఇలా అయిపోయానేంటి? అనే బాధతోనే ఉంటాడు. కొడుక్కి మంచి లైఫ్‌ ఇవ్వాలని లాటరీ టికెట్లు కొంటూనే ఉంటాడు. ఈ సీన్లు కొడుకుపై తండ్రికి ఉన్న ప్రేమని, తన దీన స్థితిని అర్థంపడతాయి. ఎమోషనల్‌గానూ ఉంటాయి. కానీ అదే ఎమోషన్స్ సినిమా మొత్తం క్యారీ అయితే బాగుండేది.

షాయాజీ షిండే, సుధీర్‌ బాబు రిలేషన్స్ కి వస్తే, తండ్రి కొడుకుని విసుక్కుంటాడు. అయినా తండ్రిపై ప్రేమ చూపిస్తుంటాడు కొడుకు. తండ్రి వరుసగా తప్పులు చేస్తుంటాడు, అప్పులు చేస్తుంటాడు, షేర్‌ మార్కెట్‌ అని చెప్పి లాస్‌ అవుతుంటాడు. దీంతో ఆ అప్పులన్నీ కొడుకు తీర్చుతుంటాడు. కానీ తండ్రిని ఒక్క మాట కూడా అనడు.  అది నాన్నపై ఉన్న ప్రేమకి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ కొత్త ఫీలింగ్‌ని కలిగిస్తుంది. 
 

అయితే ఆ తర్వాత తన భార్య చెప్పినట్టు సుధీర్‌ బాబుని దత్తత తీసుకోవడం వల్లే తాను నష్టపోయానని, భార్య, జాబ్‌ని, ఆస్తులను కోల్పోయి ఇలాంటి స్థితికి వచ్చాననే కోపం తండ్రిలో ఉంటుందనే విషయంలో అంతటి వెయిటేజ్‌ లేదు. అది ఆడియెన్స్ కి కిక్‌ ఇవ్వలేదు. మరోవైపు ఓ కోటి రూపాయల మోసంలో తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఉండటం, అదేసమయంలో సాయిచంద్‌కి లాటరీ తగలడం, ఆ డబ్బులు తెచ్చుకోవడం కోసం సుధీర్‌బాబుతో కలిసి వెళ్లే పరిస్థితి రావడం కొంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, సెకండాఫ్‌లో ఆ జర్నీని సాగదీసినట్టుగా అనిపించడంతో ఆ మజా మిస్‌ అయ్యింది.

ఎమోషనల్‌గా సాగే మూవీ కావడంతో ఎంటర్టైన్‌మెంట్‌కి పెద్దగా స్కోప్‌ లేదు. పైగా కొంత స్లోగా సాగడంతో అది ఆడియెన్స్ కి బోర్‌ ఫీలింగ్‌ని తెప్పిస్తుంది.  దీనికితోడు మధ్య మధ్యలో సింక్‌ లేని సీన్లని, లింక్‌ లేని పాత్రలు రావడంతో కథ డైవర్ట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది.  లవ్‌ ట్రాక్‌ కి పెద్దగా స్కోప్‌ లేదు. అది పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేదు. సెకండాఫ్‌ లో దర్శకుడు కొంత తికమక పడ్డట్టుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం  ఎమోషనల్‌గా డీల్‌ చేశాడు. 25ఏళ్లు వెతుకుతున్న కొడుకు దొరికినప్పుడు, ఆయన ఎవరో తెలిసినప్పుడు తండ్రి రియాక్ట్ అయ్యే విధానం, ఆ సమయంలో ఎమోషన్స్ ని మరింత బాగా తీయాల్సింది. అయితే చివర్లో ఇద్దరు పాత్రల్లో వచ్చే మార్పు, ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. 

అదే సమయంలో తండ్రి ఎవరో తెలిసినప్పుడు కొడుకు రియాక్షన్‌, దాని తాలూకు ఎమోషన్స్ ని బాగా డీల్‌ చేయాల్సింది . ఎమోషన్స్ సీన్లే ఈ మూవీకి బలం, వాటిని సినిమా మొత్తం అదే స్థాయిలో క్యారీ చేస్తే బాగుండేది. అయితే చాలా చోట్లు ఆ సీన్ల ని బీజీఎం హైలైట్‌ చేస్తుంది. ఆర్‌ఆర్‌ చాలా చోట్ల కవర్‌ చేసిందని చెప్పొచ్చు. ఎమోషన్స్ విషయంలో దర్శకుడు మరింత శ్రద్ధ పెట్టి, స్క్రీన్‌ప్లే పై కొంత వర్క్ చేస్తే సినిమా ఫలితం అదిరిపోయేది. 
 

నటీనటులుః 
జానీ పాత్రలో సుధీర్‌బాబు బాగా చేశాడు. యాక్షన్‌ హీరో ఇమేజ్‌ ఉన్న ఆయన ఇలాంటి అండర్‌ ప్లే క్యారెక్టర్‌ చేయడం గొప్పవిషయం. నటుడిగా సుధీర్‌బాబుని అభినందించాల్సిందే. చాలా బాగా చేశాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాధ, కోపం, ఆవేదన, నిస్సాయత వంటి ఫీలింగ్స్ ని ప్రదర్శించే విషయంలో ది బెస్ట్ ఇచ్చాడు. నటుడిగా ఒక మెట్టు ఎక్కించే చిత్రమవుతుంది. ఓ తండ్రిగా షాయాజీ షిండేకి కూడా ఇది ఓ కొత్తరకమైన పాత్ర అనే చెప్పాలి. అయినా బాగా చేశాడు.

మరోతండ్రిగా సాయిచంద్‌ తనకు సెట్‌ అయ్యే పాత్రలో జీవించేశాడు. ఆయనకది చాలా ఈజీ రోల్‌ అని చెప్పొచ్చు. చాలా సినిమాల్లోనూ అలాంటి పాత్రల్లోనే కనిపించి మెప్పించాడు. ఇందులోనూ ఆకట్టుకున్నాడు. బాలనటిగా మెప్పించిన అని కూడా ఉన్నంతలో మెప్పించింది. హీరోయిన్‌ పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. బలవంతంగా ఇరికించినట్టుగానే ఉంటుంది. ఇక మిగిలిన పాత్రలకు పెద్దగా స్కోప్‌ లేదు. కానీ ఉన్నంతలో ఓకే అని చెప్పొచ్చు.  
 

టెక్నీషియన్లుః 
జే క్రిష్‌ మ్యూజిక్‌ సినిమాకి ఓ ప్లస్‌ అని చెప్పొచ్చు. కానీ ఆ మ్యూజిక్‌ స్థాయిలో సీన్లు లేకపోవడంతో చాలా సీన్లు తేలిపోయాయి. అదే సమయంలో ఆర్‌ఆర్‌ ఓవర్‌ డోస్‌ లా అనిపిస్తుంటుంది. సమీర్‌ కళ్యాణి కెమెరా వర్క్ బాగుంది. ఉన్నంతలో బాగా చూపించే ప్రయత్నం చేశారు. అనిల్‌ కుమార్‌ పి ఎడిటింగ్‌ ఓకే. ఎందుకంటే సినిమానే రెండు గంటలు. ఇంకా కట్ చేయడానికి ఏం లేదు.

నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు అభిలాష్‌ ఎంచుకున్న కథ బాగుంది. కొత్తగానూ ఉంది. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంతో కొంత తడబాటు కనిపించింది.  కానీ ముగింపుని మాత్రం ఎమోషనల్‌గా మార్చేసి గుండె బరువెక్కించారు. అక్కడ దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ

ఫైనల్‌గాః ఎమోషన్స్ లేని, స్లోగా సాగే `మా నాన్న సూపర్‌ హీరో`. 
రేటింగ్‌ః 2
 

click me!