రామారావు బ్యాడ్‌ హ్యాబిట్‌కి బలైన శ్రీదేవి.. ఆ మాట చెప్పలేక అతిలోక సుందరిని నీటి కాల్వలో పడేశాడా?

Published : Apr 24, 2024, 04:04 PM IST

ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి చాలా సినిమాలు చేశారు. హిట్ పెయిర్‌గా నిలిచారు. అయితే షూటింగ్‌లో ఎన్టీఆర్‌కి ఉన్న ఒక చెడ్డ అలవాటని బయటపెట్టింది శ్రీదేవి.   

PREV
18
రామారావు బ్యాడ్‌ హ్యాబిట్‌కి బలైన శ్రీదేవి.. ఆ మాట చెప్పలేక అతిలోక సుందరిని నీటి కాల్వలో పడేశాడా?

సీనియర్‌ ఎన్టీఆర్, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. మోస్ట్ హిట్‌ పెయిర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌కి మనవరాలిగా చేసిన శ్రీదేవి, ఆ తర్వాత ఆయన ప్రియురాలిగానూ అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై పోటా పోటీగా నటించి మెప్పించారు. దీంతో వీరిద్దరి మధ్య అనేక మధురమైన జ్ఞాపకాలున్నాయి. చాలా తీపి గుర్తులున్నాయి. మర్చిపోలేని ఫన్నీ విషయాలు కూడా చోటు చేసుకున్నాయట. 
 

28

ఆ సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఇప్పుడు మాత్రం అవి చాలా ఫన్నీగా, సరదాగా అనిపిస్తాయి. నవ్వుకునేలా ఉంటాయి. అయితే అలాంటి సన్నివేశాలు చాలా చోటు చేసుకున్నాయట. దర్శకుడు రాఘవేంద్రరావు ఈ విషయాన్ని బయటపెట్టాడు. `సౌందర్య లహరి` కార్యక్రమంలో శ్రీదేవి పాల్గొన్న ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌, శ్రీదేవి మధ్య జరిగిన సరదా సన్నివేశాలను వెల్లడించాడు రాఘవేంద్రరావు. 
 

38

ఈ సందర్భంగా రామారావుకి ఉన్న ఒక బ్యాడ్‌ హ్యాబిట్‌ ని బయటపెట్టాడు. సహజంగా ఆయన షూటింగ్‌లకు ప్యాకప్‌ చెప్పడట. అలా చెప్పే అలవాటు లేదు. దర్శకుడు చెబితేనే వెళ్లిపోతాడు. తనకు ఏదైనా పని ఉన్నా, ఇంట్రెస్ట్ లేకపోయినా త్వరగా వెళ్లిపోవాలనుకుంటే కొంటె పనులు చేసేవాడట. ఆ విషయం చెప్పకుండా మరో రూపంలో దాన్ని బయటపెడుతుండేవాడట. ప్యాకప్‌ చెప్పకుండా షూటింగ్‌లు చెడగొట్టేవాడట. దానికి అతిలోక సుందరిని వాడుకునేవాడని తెలిపారు రాఘవేంద్రరావు. 

48

ఓ రోజు షూటింగ్‌ చివరికి చేరుకుంది. ప్యాకప్‌ చెప్పాలి. కానీ ఆయన చెప్పలేకపోయాడు. ఊటిలో ఓ రోజు షూటింగ్‌ సమయంలో ఎవరికి చెప్పకుండా నీళ్లల్లోకి దిగిపోయాడట. ఆ తర్వాత శ్రీదేవిని నెమ్మదిగా దిగమన్నాడట. ఆ దిగుతున్నాను అని శ్రీదేవి అనే లోపు ఆమెని గట్టిగా కిందకి గుంజేశాడట. శ్రీదేవి డ్రెస్‌ అంతా తడిసిపోవడంతో అయ్యో డ్రెస్‌ తడిసిందిగా షూటింగ్‌ చేయడం ఎట్లా అని చెప్పి వెళ్లిపోయేవాడట. 
 

58

మరోసారి కూడా తనకు ఏదో పని ఉండేనట. దీంతో శ్రీదేవిని పక్కన కాల్వ ఉంటే అందులోకి తోసేశాడట. హీరోయిన్ డ్రెస్ తడిసిపోయింది. షూటింగ్‌ ఎట్లా.. ప్యాకప్‌ అని చెప్పి వెళ్లిపోయిండంట. ఇలాంటి చాలా చేశాడని దీనికి శ్రీదేవి కూడా చెప్పడం విశేషం. మరో సందర్భంలో మరోసారి కూడా ఇలానే చేశాడట. ఏకంగా యాక్సిడెంట్‌ చేశాడట రామారావు. 
 

68

`వేటగాడు` సినిమాలో `బంగారు బాతు గుడ్డు` షూటింగ్‌ చేస్తున్నారట. ఫారెస్ట్ లో చిత్రీకరణ జరుగుతుంది. ఈ పాట చిత్రీకరించే సమయంలో  ఎన్టీఆర్ జీపులో వస్తున్నాడట. శ్రీదేవి ముందు నడుచుకుంటూ వెళ్తుందట. బ్రేకులు పడలేదని చెప్పి సడెన్‌గా శ్రీదేవిని గుద్దేశాడట. దీంతో ఆమె కిందపడిపోయింది. కాలుకి కాస్తా గాయమైందట. ఆ సమయంలో ఏం పర్వాలేదు, లేచి రా అని చెప్పి, అయ్యో శ్రీదేవికి గాయమైందిగా అని ప్యాకప్‌ చెప్పాడట ఎన్టీఆర్. 
 

78

ఇలాంటి చిలిపి పనులు ఆయనలో చాలా ఉండేవని శ్రీదేవి, రాఘవేంద్రరావు వెల్లడించారు. మొత్తంగా తన బ్యాడ్‌ హ్యాబిట్‌ కారణంగా శ్రీదేవిని బాగానే ఇబ్బంది పెట్టాడు రామారావు. 

88

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో `వేటగాడు`, `కొండవీటి సింహాం`, `బొబ్బిలి పులి`, `జస్టీస్‌ చౌదరి`, `సర్దార్‌ పాపారాయుడు`, `అనురాగ దేవత`, `గజదొంగ`, `సింహం నవ్వింది`, `ఆటగాడు`, `బడిపంతులు`, `రౌడీ రాముడు కొంటే కృష్ణుడు`, `ప్రేమ సింహాసనం`, `సత్యం శివం`, `అగ్గి రవ్వ` వంటి సినిమాలు వచ్చి విజయాలు సాధించాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories