స్టార్ హీరోకు చుక్కలు చూపించిన శ్రీదేవి..? ఎవరా హీరో.. ఎందుకలా చేసింది..?

First Published | Aug 8, 2024, 8:42 PM IST

దివంగత హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియాను ఊపేసిన అతిలోక సుందరి.. తన కెరీర్ లో ఓ హీరోను మాత్రం కాస్త ఇబ్బంది పెట్టిందట. ఇంతకీ ఎవారా హీరో..? 
 

Sridevi

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి ఒక్కతే. ఆమె అందాన్ని గంధర్వ కాంతలతో పోల్చుతుంటారు. అంతలా ఫ్యాన్స్ ను మైకంలో ముంచిన తార.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన స్టార్ డమ్ ను కొనసాగించింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి 50 ఏళ్లకే కన్నుమూసి.. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. 
 

సమంత - రష్మిక ఇన్స్టాగ్రామ్ లో టాప్ ఎవరు..? ఫాలోయింగ్ లో టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళే..?

sridevi

ఇక శ్రీదేవి తెలుగు తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు నటించింది. అయితే ఆమె మెగాస్టార్ తో కొన్ని సినిమాలు మిస్ అయ్యిందన్న టాక్ కూడా ఉంది. అంతే కాదు చాలా సార్లు సినిమాల విషయంలో శ్రీదేవి మెగాస్టార్ ను ఇబ్బంది కూడా పెట్టందన్న టాక్ ఉంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. పుకార్లు మాత్రం గట్టిగానే వినిపించాయి. ఇంతకీ విషయం ఏంటంటే..? 

42 ఏళ్ళ అల్లు అర్జున్ ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటి..? బన్నీ డైట్ లో అది తప్పనిసరి..?


చిరంజీవితో సినిమాల విషయంలో  శ్రీదేవి డిమాండ్స్ కాస్త ఎక్కవగా ఉండేవట. కథ విన్నతరువాత శ్రీదేవి  తన పాత్ర కు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉండాలి.. టైటిల్ ఇది కాదు అది పెట్టండి.. అంటూ చాలా విషయాల్లో మేకర్స్ ను డిమాండ్ చేసేదని కొంత మంది వాదన. అందులో నిజం ఉందా లేదా అనేది తెలియదు కాని.. అలానే శ్రీదేవి కొండ వీటి దొంగ సినిమా ఛాన్స్ మిస్ అయ్యిందని అంటుంటారు. ఈసినిమాలో రాధ ప్లేస్ లో శ్రీదేవినటించాల్సి ఉంది. తన డిమాండ్స్ విని మేకర్స్ శ్రీదేవిని వద్దనుకున్నారని టాక్. 

నాగచైతన్య ‌‌- శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంత..? వీరి ప్రేమ ఎక్కడ మొదలయ్యిందో తెలుసా..?
 

ఇక మెగాస్టార్ జోడీగా శ్రీదేవి  నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయినవే. మరీ ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే అటుచిరు, ఇటు శ్రీదేవి. ఇద్దరి ఇమేజ్ ను ఎక్కడో తీసుకెళ్ళి పెట్టింది. అయితే ఈసినిమాకు జగదేవక వీరుడు టైటిల్ అనుకున్నారట. కాని ఆతరువాత అతిలోక సుందరి లైన్ ను శ్రీదేవే అతికించిందని టాక్. 

పవన్ కళ్యాణ్ సినిమాలో బాలీవుడ్ లెజండరీ స్టార్ యాక్టర్..? 'హరి హర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు..?

Sridevi

ఇక చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో మోసగాడు, జగదేకవీరుడు అతిలోకసుందరి,ఎస్పీ పరశురామ్ వంటి సినిమాలు వచ్చాయి. అయితే  శ్రీదేవి సినిమాల కోసం చేసే డిమాండ్స్ అలానే ఉంటాయి అనడానికి బాహుబలి కూడా ఒక ఊదాహరణగా చెప్పవచ్చు. ఈసినిమా లో రాజమాత శివగామిగా శ్రీదేవిని అడిగారట రాజమౌళి. కాని ఆమె చేసిన డిమాండ్స్ గురించి జక్కన్న ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కాని ఈ విషయాలను బోనీ కపూర్ ఓ సందర్భంలో కొట్టిపారేశారు. అవి నిజం కాదని అన్నారు. 

Latest Videos

click me!