ముదురుతున్న అల్లు-మెగా వివాదం... అల్లు అర్జున్ టార్గెట్ గా పవన్ కళ్యాణ్ పరోక్ష వ్యాఖ్యలు!

First Published | Aug 8, 2024, 8:25 PM IST

కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ హీరో అల్లు అర్జున్ పై చేసిన పరోక్ష విమర్శలు దుమారం రేపుతున్నాయి. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది అనడానికి ఈ విమర్శలు నిదర్శనం అనే వాదన తెరపైకి వచ్చింది... 
 

Allu Arjun

అల్లు అర్జున్ మెగా హీరోలకు దూరమయ్యాడు. చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది. గతంలో ఈ విమర్శలను అల్లు అరవింద్, చిరంజీవి ఖండించారు. అల్లు అర్జున్ మాత్రం మెగా హీరో అనే ట్యాగ్ వద్దనుకుంటున్నాడు. అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. 

Ram Charan and Allu Arjun

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన పరిణామం మరింత చిచ్చు రాజేసింది. కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్... నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి నేరుగా వెళ్లి మద్దతు తెలిపాడు. ఇది మెగా ఫ్యామిలీకి అసలు నచ్చలేదు. పరోక్షంగా వైసీపీ పార్టీకి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించినట్లు అయ్యింది. 


Allu Arjun

పోలింగ్ ముగిసిన సాయంత్రం నాగబాబు సోషల్ మీడియాలో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే అంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డాడు. అల్లు అర్జున్ ని ఉద్దేశించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని ఫ్యాన్స్ భావించారు. నాగబాబును ట్రోల్ చేశారు. ఆయన కొన్నాళ్ళు ట్విట్టర్ అకౌంట్ కి దూరమయ్యాడు. 

అల్లు అర్జున్ ని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. అల్లు అర్జున్ అంటే మెగా హీరోలు, కుటుంబ సభ్యులు నచ్చనట్లే ఉంటున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ అటాక్ చేశాడు. కర్ణాటక పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్... పుష్ప చిత్రంపై పరోక్ష విమర్శలు చేశాడు. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను పెంచి అభివృద్ధి చేసే పాత్రల్లో నటించేవారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. 

చిత్ర పరిశ్రమకు చెందినవాడిగా ఇలాంటి పాత్రలు చేయాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అని పవన్ కళ్యాణ్ అన్నారు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లింగ్ రోల్ చేశారు. పుష్ప హీరో అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశాడనే వాదన మొదలైంది. లేదు అందరు హీరోలను ఉద్దేశించి ఆయన జనరల్ గా చెప్పాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఎటు దారి తీస్తాయో చూడాలి.. 
 

Latest Videos

click me!