నాగార్జున కోడలు శోభిత ధూళిపాళ్లకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది? కట్నం ఎంత ఇచ్చిందో తెలుసా?

First Published | Aug 8, 2024, 7:46 PM IST

అక్కినేని వారి ఇంటికి కోడలిగా వెళ్లే అదృష్టం దక్కించుకుంది శోభిత ధూళిపాళ్ల. కాగా ఈ యంగ్ హీరోయిన్ కి ఎంత ఆస్తి ఉంది? నాగ చైతన్యకు ఎంత కట్నం ఇచ్చిందో చూద్దాం.. 
 

Naga Chaitanya-Sobhita Dhulipala

హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేయనున్నారు. ఆగస్టు 8వ తేదీ ఉదయం శోభిత-నాగ చైతన్యల నిశ్చితార్థం వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. అత్యంత నిరాడంబరంగా ముగించారు. . 

నాగార్జున తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో శోభిత-నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోలు పోస్ట్ చేశారు. కొత్త జంట కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. తన కుటుంబంలోకి కొత్త సభ్యురాలు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ అని కామెంట్ చేశాడు నాగార్జున


నాగ చైతన్య-శోభితకు అభిమానులు శుభాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నాగ చైతన్య, శోభిత మధ్య రహస్య ప్రేమాయణం సాగింది. రెండేళ్లుగా వీరి ఎఫైర్ పుకార్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విదేశాల్లో విహరిస్తున్న నాగ చైతన్య,శోభిత ఫోటోలు వైరల్ అయ్యాయి. 

శోభిత వివరాలు తెలుగు ఆడియన్స్ కి తెలిసింది చాలా తక్కువ. ఎందుకంటే ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఇతర భాషల్లో ఎక్కువగా నటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలిలో శోభిత పుట్టింది. వైజాగ్, ముంబై నగరాల్లో చదువుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించి, నటిగా మారింది. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసింది. 

ఒక అంచనా ప్రకారం శోభితకు రూ. 7-10 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇదంతా కేవలం ఆమె సంపాదనట. కేవలం నాగ చైతన్య పేరిట ఆస్తుల విలువ రూ. 150 కోట్ల వరకు ఉంటాయట. నాగార్జున ఆస్తుల విలువ వేల కోట్లలో ఉంది. ఇక నాగార్జున కట్నంగా ఒక్క రూపాయి ఆశించడం లేదు. ఆధునిక సమాజంలో కట్నం తీసుకోవడం నేరం. తరతరాలు తిన్నా తరగని ఆస్తి వారికి ఉంది. అదన్నమాట సంగతి.... 
 

Latest Videos

click me!