శ్రీదేవి మరణం... నాగార్జునకు తెలిసిన నిజం ఏమిటీ? ఆ విషయం ముందే తెలుసా!

Published : Oct 03, 2023, 01:09 PM IST

వెండితెర లెజెండ్ శ్రీదేవి అకాల మరణం దేశాన్ని ఊపేసిన సంఘటన. దుబాయ్ లో అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించగా పలు వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే శ్రేదేవి మరణం గురించి హీరో నాగార్జునకు కొన్ని విషయాలు తెలుసని సమాచారం.   

PREV
17
శ్రీదేవి మరణం... నాగార్జునకు తెలిసిన నిజం ఏమిటీ? ఆ విషయం ముందే తెలుసా!
Sridevi


2018 ఫిబ్రవరి 24, కోట్లాది శ్రీదేవి అభిమానుల గుండెలు బద్దలైన రోజు. ఆమె ఇక లేరన్న వార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ వివాహ వేడుకకు కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి. 
 

27


శ్రీదేవి మరణం వెనుక కుట్ర కోణం ఉందన్న పుకార్లు లేచాయి. బోనీ కపూర్ కి వ్యతిరేకంగా ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. శ్రీదేవి పేరిట రూ. 100 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఆ డబ్బు కోసం ఆమెను చంపేశారని ఓ వాదన తెరపైకి వచ్చింది. బోనీ కపూర్, అర్జున్ కపూర్ లను ద్రోషులుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. 

37
Sridevi

దుబాయ్ పోలీసులు మాత్రం ప్రమాదవశాత్తు శ్రీదేవి చనిపోయినట్లు డెత్ రిపోర్ట్ విడుదల చేశారు. ఆమె శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు కనిపించాయి. మద్యం మత్తులో బాత్ టబ్ లో పడి ఊపిరి ఆడక చనిపోయారని రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయినప్పటికీ అనుమానాలు తీరలేదు. శ్రీదేవిని ఎవరో చంపేశారని నమ్మే ఓ వర్గం ఉన్నారు. 
 

47

ఎన్ని విమర్శలు వచ్చినా బోనీ కపూర్ మాత్రం పెదవి విప్పలేదు. ఆయన మీడియాకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు బోనీ కపూర్ ఓపెన్ అయ్యారు. కొన్ని సంచలన నిజాలు బయటపెట్టాడు. శ్రీదేవి అందం కోసం కఠిన డైట్ ఫాలో అయ్యేవారు. ఆహారంలో ఉప్పు లేకుండా చూసుకునేవారు. అసలు ఉప్పు వాడకపోవడం వలన బీపీ సమస్యలు వచ్చేవి. అప్పుడప్పుడు కళ్ళు తిరిగిపడిపోయేది. వైద్యులు హెచ్చరించినా ఆమె ఆహారపు అలవాట్లు మార్చుకోలేదని, అన్నాడు. 
 

57
Sridevi

అయితే హీరో నాగార్జున కూడా ఇదే విషయం తనకు చెప్పాడని బోనీ కపూర్ చెప్పడం సంచలనమైంది. శ్రీదేవి మరణం అనంతరం నాగార్జున నన్ను ఓ సందర్భంలో కలిశారు. అప్పుడు శ్రీదేవి గురించి మాట్లాడుకునే క్రమంలో ఓ సారి సినిమా సెట్స్ లో శ్రీదేవి కళ్ళు తిరిగి పడిపోయారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పాడని, బోని కపూర్ నాగార్జునను సీన్లోకి లాగాడు. 
 

67
Sridevi

దీంతో శ్రీదేవి మరణంపై నాగార్జునకు కొంత అవగాహన ఉంది. శ్రీదేవి కళ్ళు తిరిగి బాత్ టబ్ లో పడి, ఎవరూ చూడకపోవడంతో ఊపిరి ఆడక చనిపోయారని నమ్ముతున్నారు. అదే సమయంలో అందంగా కనిపించాలన్న పిచ్చి ఆమె చావుకు పరోక్షంగా కారణమైంది. అతి డైటింగ్ సరి కాదని చెప్పేందుకు శ్రీదేవి జీవితం ఉదాహరణ అంటున్నారు. 
 

77


శ్రీదేవి చనిపోయే వరకు నటిస్తూనే ఉన్నారు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ అలరించారు. మరణించే నాటికి శ్రీదేవి వయసు కేవలం 54 ఏళ్ళు. తన ఇద్దరు టీనేజ్ కూతుళ్ళ కంటే అందంగా కనిపించాలని తాపత్రయ పడేది. జాన్వీ కపూర్ ఫస్ట్ మూవీ దఢక్ షూటింగ్ దశలో ఉండగా శ్రీదేవి కన్నుమూశారు. శ్రీదేవి చివరి చిత్రం జీరో. ఆమె మరణాంతరం విడుదలైంది. 1994లో విడుదలైన ఎస్పీ పరశురామ్ తెలుగులో ఆఖరి మూవీ. 
 

Read more Photos on
click me!

Recommended Stories