ఓ స్టార్ హీరోయిన్ తన కెరీర్‌లో మరిదితో ఏకంగా 14 సినిమాల్లో నటించింది. తెరపై వీళ్లిద్దరూ సూపర్ హిట్ పెయిర్ గా నిలిచారు. నిజ జీవితంలో మాత్రం ఆ హీరో అన్ననే పెళ్లాడి షాక్ ఇంచ్చింది. చిన్నవయసులోనే కన్నుమూసిన తార ఎవరు?
తెరపై కనిపించే జంటలు నిజ జీవితంలో ఒక్కటైతే బాగుండని అభిమానులు కోరుకుంటారు. కానీ ఈ నటి తన మరిదితో ఏకంగా 14 సినిమాల్లో నటించి మెప్పించింది. వీరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యేవారు. ఆ నటి మరెవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి.
25
300 సినిమాల్లో నటించిన అతిలోక సుందరి..
దాదాపు 250 నుంచి 300 సినిమాల్లో నటించిన శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేరు. ఆమె ఇద్దరు కూతుళ్లలో ఒకరు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోగా, మరొకరు ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌ను పెళ్లాడిన శ్రీదేవి.. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు.
35
శ్రీదేవి - అనిల్ కపూర్ జంటగా...
అతిలోక సుందరి శ్రీదేవి - అనిల్ కపూర్ జంటగా సినిమాలు వస్తున్నాయంటే చాలు, జనం థియేటర్లకు పరుగులు పెట్టేవారు. కానీ నిజ జీవితంలో అనిల్ కపూర్ ఆమెకు మరిది అవుతారు. శ్రీదేవి భర్త బోణీ కపూర్‌కు, అనిల్ కపూర్ స్వయానా తమ్ముడు. ఇంట్లో వదిన, కానీ స్క్రీన్‌పై మాత్రం హిట్ పెయిర్.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి, అతి తక్కువ వయసులోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత 'చాందిని', 'మిస్టర్ ఇండియా', 'నగీనా' వంటి సినిమాలు ఆమెకు దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీని తెచ్చిపెట్టాయి. తన అద్భుత నటనతో భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ స్టార్‌గా నిలిచారు.
55
ఇండస్ట్రీలో శ్రీదేవి వారసురాలు..
శ్రీదేవి తన భర్త బోణీ కపూర్‌తో కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కానీ శ్రీదేవి-అనిల్ కపూర్ జంటను బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జోడీగా గుర్తిస్తారు. బోణీ కపూర్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శ్రీదేవి, 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఆతరువాత అనుమానస్పద పరిస్థితుల్లో శ్రీదేవి 2018 లో మరణించారు. ఇప్పుడు ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా తల్లి బాటలోనే అన్ని భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.