ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన పాన్ ఇండియా హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?

Published : Apr 17, 2026, 07:47 AM IST

ఫిల్మ్ సెలబ్రిటీలకు కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు వదిలేసుకోక తప్పని పరిస్థితులు వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఆ టైమ్ లో తీసుకునే నిర్ణయం.. కెరీర్ ను ప్రభావితం చేస్తుంటుంది. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురయ్యింది ఎన్టీఆర్ హీరోయిన్ కి. 

PREV
15
ఎన్టీఆర్ కోసం ధనుష్ కు హ్యాండ్ ఇచ్చిన హీరోయిన్

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు చేస్తున్న ఓ పాన్ ఇండియా హీరోయిన్ కు చిత్రమైన పరిస్థితి వచ్చింది. ఇద్దరిలో ఎవరో ఒకరి సినిమాను మాత్రమే చేయడానికి అవకాశం ఉండటంతో.. ఆమె తెలివిగా ఆలోచించి అందులో ఒకరికి మాత్రమే కమిట్ అయ్యింది. ఆ హీరోలో ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్, ధనుష్. ఆ హీరోయిన్ కూడా ఎవరో కాదు.. కాంతార సినిమాలతో.. పాన్ ఇండియా ఇమేజ్ సాధించిన రుక్మినీ వసంత్. చాలా తక్కువ కాలంలోనే సౌత్ ఇండియాలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సాధించిన రుక్మిణి వసంత్ వరుసగా అవకాశాలు సాధిస్తోంది.

25
రుక్మిణి వసంత్ పాన్ ఇండియా ప్లాన్..

ప్రస్తుతం రుక్మిణి వసంత్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ‌- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ డ్రాగన్ లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాన్ ఇండియాలో పాతుకుపోవాలని ఆమె ప్లాన్ చేసింది. అందుకే ఫోకస్ అంతా డ్రాగన్ సినిమాపైనే పెట్టింది బ్యూటీ. అంతే కాదు ఈ మూవీ కోసం ఆమె పెద్ద పెద్ద సినిమాలను వదిలేసుకోవలసిన పరిస్థితి ఎదురయ్యింది.

35
రుక్మిణికి కొత్త సమస్యలు

డ్రాగన్ మూవీ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న టైమ్ కంటే ఆలస్యం కావడంతో రుక్మిణికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ‘డ్రాగన్’ కోసం అదనంగా బల్క్ డేట్స్ కేటాయించాల్సి రావడంతో, ఇతర భాషల్లో ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులకు సమయం కేటాయించడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన నటించే కీలక అవకాశాన్ని ఆమె వదులుకోవాల్సి వచ్చింది. ధనుష్ చేయబోయే కొత్త సినిమాలో రుక్మిణి హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్ సినిమాకు డేట్లు కేటాయించాల్సి రావడంతో.. ఆమె ధనుష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

45
ధునుష్ జోడీగా ధురంధర్ హీరోయిన్

రుక్మిణి వసతంత్ ఈ అవకాశాన్ని వదులుకోవడంతో.. ఆ ప్లేస్ లో ధురంధర్ హీరోయిన్ చేరింది. నటి సారా అర్జున్ ధనుష్ జోడీగా అవకాశం దక్కించుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న సారా, ఇప్పుడు హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఇప్పటికే తెలుగులో ‘యుఫోరియా’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన ఆమెకు, ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్ మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు.

55
డ్రాగన్ సినిమాపైనే ఫుల్ ఫోకస్

మరోవైపు, రుక్మిణి మాత్రం ‘డ్రాగన్’ సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టింది. ఈసినిమా బాగా వర్కౌట్ అయితే.. ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుంది. పాన్ ఇండియా క్రేజ్ ను నిలబెట్టుకోవడంతో పాటు.. స్టార్ హీరోల సరసన మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా ప్రస్తుతం నేషనల్ క్రష్ గా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రష్మికకు రుక్మిణి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. చూడాలి డ్రాగన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో. ?

Read more Photos on
click me!

Recommended Stories