లబోదిబోమంటూ నారా లోకేష్ కి శ్రీరెడ్డి ఓపెన్ లెటర్..పాపం చేశాను, వైసీపీ అధికారంలోకి వచ్చినా ఇక ఆపని చేయను

First Published | Nov 14, 2024, 1:24 PM IST

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై, రాజకీయ నాయకులపై చేస్తూ, అసభ్యకర పోస్ట్ లు పెట్టే వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Actress Sri Reddy

ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై, రాజకీయ నాయకులపై చేస్తూ, అసభ్యకర పోస్ట్ లు పెట్టే వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెడుతూ అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసిపి సోషల్ మీడియాలో విభాగాల్లో కీలక స్థానంలో అంటూ చంద్రబాబు, పవన్, నారా లోకేష్ లపై వ్యక్తిగతంగా దారుణమైన పోస్ట్ లు చేస్తూ, వారి కుటుంబ సభ్యులని కూడా టార్గెట్ చేసిన వాళ్ళని పోలీసులు వదిలిపెట్టడం లేదు. 

ఈ నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ దారుణమైన కామెంట్స్, మార్ఫింగ్ ఫొటోస్, అసభ్యకర పదజాలం ఉపయోగించిన రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి లాంటి వారిపై కూడా పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ఆల్రెడీ వీరిపై కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్, పవన్ కళ్యాణ్.. వారి కుటుంబ సభ్యులపై బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీనితో రాజమండ్రిలో శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అరెస్ట్ కూడా ఉండొచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. 


ప్రమాదాన్ని ముందే గహించిన శ్రీరెడ్డి కొన్ని రోజులుగా లోకేష్, పవన్ కళ్యాణ్ లకు క్షమాపణ చెబుతూ కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది. అయినా ఆమెపై కేసు నమోదైంది. దీనితో తాజాగా శ్రీరెడ్డి లబోదిబోమంటూ నేరుగా నారా లోకేష్ కి ఓపెన్ లెటర్ రాసింది. తనని రక్షించాలి అంటూ వేడుకుంటోంది. లోకేష్ అన్నకి విజ్ఞప్తి.. ఈ విషయంలో నేను ఆల్రెడీ క్షమాపణలు కోరాను. మా కుటుంబ సభ్యులు టిడిపికే ఓటు వేశారు. ఈ వివాదంలో నేరుగా మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పమని మా కుటుంబ సభ్యులు నాతో చెప్పారు. 

కానీ మిమ్మల్ని కలిసే స్థాయి నాకు లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ రాస్తున్నా అన్నా. గత పది రోజులుగా మీడియా ఛానల్స్ లో డిబేట్లు జరుగుతున్నాయి. మీ కార్యకర్తలు నన్ను దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత నా రూడ్ కామెంట్స్ తో నేను ఎంతో మంది మనోభావాల్ని దెబ్బతీసానని నాకు అర్థం అయింది. అత్యంత జుగుప్సాకరమైన భాషలో మాట్లాడి పాపం చేశాను. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి, జనసేన పార్టీ కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెబుతున్నా. దయచేసి అందరూ పెద్ద మనసు చేసుకుని మీ తెలుగు అమ్మాయిని క్షమించండి. 

వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఇకపై అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎవరిపైనా చేయను. ఒక వేళ వైసీపీ అధికారంలోకి వస్తే నా వక్ర బుద్ది తిరిగి వస్తుంది అని అనుకోవద్దు. నేను మిమ్మల్ని ఎంత బాధపెట్టానో అర్థం అవుతోంది. నేను నా కుటుంబ సభ్యులు ఇప్పటికే 1000 ఏళ్లకు సరిపడా క్షోభ అనుభవించాం. మా ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలు ఉన్నారు. నాపై కేసు పెడితే వాళ్ళని శిక్షించినట్లు అవుతుంది. దయచేసి అలా చేయవద్దు అంటూ శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ లో నారా లోకేష్ ని వేడుకుంది. మరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!