కస్తూరి బెయిల్ పిటిషన్ మదురై హైకోర్ట్ కొట్టివేసింది. కస్తూరికి బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్ట్ మధురై బ్రాండ్ జడ్జి ఆనంద్ వెంకటేష్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కస్తూరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కస్తూరి పరారీలో ఉండగా, పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. ఆమె కోసం టీమ్స్ జల్లెడ పడుతున్నాయి.
ఈ ఉదంతం అనంతరం కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. అమరన్ మూవీ పై సైతం కస్తూరి ఆరోపణలు చేయడం విశేషం. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ ఇటీవల విడుదలైన భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ముకుంద్ వరదరాజన్ బ్రాహ్మణుడు. ఆయన భార్య క్రిస్టియన్ ఎలా అవుతుంది.. అంటూ కస్తూరి అభ్యంతర కామెంట్స్ చేసింది.