ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లు, నటీనటులు కూడా ఇందులో భాగమయ్యారని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాను 120కు పైగా దేశాల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గానే కెన్యాలో షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, అక్కడి మంత్రిని కూడా రాజమౌళి టీమ్ కలిశారు. ఇక సూపర్ స్టార్ క్రేజ్ ఈ సినిమాతో ఏ రేంజ్ కు వెళ్తుందా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.