Bigg Boss 5ః హమీదతో డేట్‌కి రెడీ అంటోన్న శ్రీరామ్‌.. అమ్మాయిలను ఓ ఆట ఆడుకున్న సన్నీ.. నడుము చూశాడంటూ ప్రియాంక

Published : Oct 01, 2021, 11:48 PM IST

బిగ్‌బాస్‌5 శుక్రవారం ఎపిసోడ్‌ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. షో నాల్గో వారం ముగింపుకి చేరుకుంది. శనివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దీంతో శుక్రవారం ఇంటిసభ్యుల పర్‌ఫెర్మెన్స్ చాలా కీలకం. ఈ రోజు ఎపిసోడ్‌లో బెస్ట్, వరస్ట్ పర్ఫెర్మెర్‌లను ఎంపిక చేయడం, లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ తోపాటు సరదా మిమిక్రీలు, సెటైర్లు ఆద్యంతం నవ్వులు పూయించాయి. ఇందులో సన్నీ ఫస్ట్ టైమ్‌ తనలోని నటుడిని బయటకు తీశాడు.   

PREV
17
Bigg Boss 5ః హమీదతో డేట్‌కి రెడీ అంటోన్న శ్రీరామ్‌.. అమ్మాయిలను ఓ ఆట ఆడుకున్న సన్నీ.. నడుము చూశాడంటూ ప్రియాంక

శుక్రవారం ప్రారంభంలో ఇంటి సభ్యులు తమకి నచ్చని వారిపై ఫిర్యాదులు, ఆరోపణలతో సాగింది. ఆ తర్వాత ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్‌పెర్మెర్‌లను ఎంచుకోవాలని బిగ్‌బాస్‌ తెలిపారు. ఇందులో అత్యధిక బరువు తగ్గిన మానస్ ని బెస్ట్ పర్‌ఫెర్మర్‌గా ఎంచుకున్నారు. కెప్టెన్సీలో సరిగ్గా బాధ్యతలు నిర్వహించలేక, కెప్టెన్సీనే కోల్పోయిన జస్వాంత్‌(జెస్సీ)ని వరస్ట్ పర్‌ఫెర్మెర్‌గా ఎంచుకుని ఆయన్ని జైలుకి పంపించారు. మొదటి వారంలో జెస్సీనే జైలుకి పంపించిన విషయం తెలిసిందే. 
 

27

మరోవైపు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్లో నడుముతో పెద్ద రింగ్‌ని తిపుతూ ఉండాలి. 30 సెకన్ల పాటు కింద పడకుండా ఎవరైతే రింగ్‌ని తిప్పుతూ ఉంటారో వారికి ఓ ఫుడ్‌ ఐటెమ్‌ ఇస్తాడు బిగ్‌బాస్‌. నిన్నటి రోజు ఆకలి బాధేంటో ఇంటి సభ్యులు తెలుసుకున్నారు కాబట్టి వారి కోసం ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఇందులో లోబో, విశ్వ, యాంకర్‌ రవి, ప్రియాలు పాల్గొన్నారు. ప్రియా అట్టర్‌ ఫ్లాప్‌ ప్రదర్శన చూపించింది. కానీ రింగ్‌ని మాత్రం కిందపడకుండా జాగ్రత్త పడింది. 
 

37

మరోవైపు క్లీన్‌ బ్యూటీ టాస్క్ లో అనీ మాస్టర్‌, ప్రియాంక, ప్రియా, సిరి, శ్వేత పోటీపడ్డారు. ఇందులో ప్రియా విన్నర్‌గా నిలచ్చొని, ఓజిబా గిఫ్ట్ ని దక్కించుకుంది. మరోవైపు బ్లాక్‌ శారీలో ముస్తాబైన ప్రియాంకని చూసి ఫిదా అయ్యాడు శ్రీరామ్‌. ఆమెని చూస్తే `వాలు కనుల దానా.. `అంటూ పాటేసుకున్నారు. ఆయన పాటకి ప్రియాంక సైతం మైమరిచిపోయింది. 
 

47

చివరల్లో సరదాగా సన్నివేశాలకు తెరలేపారు. ఇందులో శ్రీరామ్‌ గెస్ట్ గా, సన్నీ హోస్ట్ గా ఓ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఇందులో శ్రీరామ్‌ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో తెలిపారు. అనీ మాస్టర్‌లోని మెచ్చూరిటీ, కాజల్‌లోని ప్రేమని, హమీదలోని ఇంటెన్సిటీ, సిరిలోని చలాకీతనం, ప్రియాంక లోని హార్డ్ వర్క్, స్వేతలోని ఫ్రెండ్ షిప్‌ కలిగిన అమ్మాయి కావాలన్నారు. ఇక సిరితో లంచ్‌కి వెళ్తానని, హమీదతో డిన్నర్కి వెళ్తానని తెలిపారు. 

57

హౌజ్‌లో ఉన్న అమ్మాయిల్లో ఎవరితో డేట్‌కి వెళ్తావని అడిగిన ప్రశ్నకి హమీదతో వెళ్తానన్నాడు శ్రీరామ్‌. అలాగే కమిటెడ్‌ కాకపోతే సిరికి ట్రై చేసేవాడినని చెప్పాడు శ్రీరామ్‌. హమీదతో ఓ రొమాంటిక్‌ సాంగ్‌ పాడుతూ డాన్సు లు వేశారు. ఇది హైలైట్‌గా నిలిచింది. మరోవైపు ఇందులో లోబో, సన్నీ ఇమిటేట్‌ చేసి చూపించారు. లోబో..ప్రియాంక ఎలా ప్రవర్తిస్తుందో చూపించారు. సన్నీ..అనీ మాస్టర్‌ వంటకాలు చేసే విధానం చెప్పారు. 
 

67

ఇక స్వేత వర్మ ఎలా ప్రవర్తిస్తుంది, ఏం మాట్లాడుతుందనేది కళ్లకి కట్టినట్టు చూపించాడు సన్నీ. దీంతోపాటు హహీదని కూడా అచ్చు దించేశాడు. శ్రీరామ్‌, హమీదల మధ్యసన్నివేశాలను చూపించి నవ్వులు పూయించాడు. సిరిపై కూడా సెటైర్లు వేసి అందరిని కడుపుబ్బ నవ్వించాడు సన్నీ. తనలోని అసలైన నటుడిని, పర్‌ఫెర్మెర్‌ని బయటకు తీశాడు. 

77

లోబో, ప్రియాంక మధ్య `ఖుషీ` సినిమాలోని భూమిక నడుముని పవన్‌ చూసే సన్నివేశాన్ని ఇమిటేట్‌ చేశారు. వీరిద్దరి మధ్య ఆయా సన్నివేశాలు కామెడీని పంచాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories