అల్లు రామలింగయ్య ఇచ్చిన మందు వల్లే తన కడుపులో మంట తగ్గిందన్న చిరంజీవి..

First Published Oct 1, 2021, 9:39 PM IST

టాలీవుడ్‌ దిగ్గజ నటుడు, కమేడియన్‌ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా రాజమండ్రిలోని ఆయన విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య చేసిన వైద్యం గురించి తెలిపారు చిరు. 

అక్టోబర్‌ 1 హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి. రాజమండ్రిలో ప్రభుత్వాసుపత్రిలో నిర్మించిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్‌ చిరంజీవి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడారు. 
 
నటుడిగా నేను రంగులు వేసుకుంది, నటుడిగా జన్మించింది రాజమండ్రి గడ్డమీదే అని తెలిపారు చిరంజీవి. `పునాది రాళ్లు`,`ప్రాణం ఖరీదు`, `మనవూరి పాండవులు` చిత్రాలు వరుసగా ఇక్కడే షూట్‌ చేశామని తెలిపారు. 
 
`నాది,  అల్లు రామలింగయ్య గారిది గురు - శిష్యుల సంబంధం.  సమయానికి భోజనం చేయకపోవడం వల్ల కడుపులో మంట వచ్చేది. ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదు. అల్లు రామలింగయ్య గారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి చేత్తో తీసినట్లు మాయమైపోయింది. 

ఇవాళ్టికీ  మా ఫ్యామిలీ హోమియోపతి మందులే వాడతాం.   హోమియోపతిలో  తగ్గని జబ్బే లేదు. రాజ్యసభ ఎం.పి.గా ఉండటం వల్లే అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు ఇవ్వగలిగాను.

సంజీవని లాంటి  హోమియో పతి వైద్యం చిరంజీవిగా ఉండాలి.  హోమియోపతి సైడ్ ఎఫక్ట్స్ లేని వైద్యం. హోమియోపతి వైద్యానికి మరింత ప్రాచుర్యం రావాలి` అని చిరు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మురళీమోహన్‌, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు ఘంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, యం.పీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. 

రాజమండ్రిలోని ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో హాస్యనటుడు అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం. గెస్ట్ గా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన చిరు.

మరోవైపు హైదరాబాద్‌లో అల్లు స్టూడియోలో తాత అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని  అల్లు అర్జున్ తన సోదరులు బాబీ, శిరీష్‌తో కలిసి ఆవిష్కరించారు.

హైదరాబాద్‌లోని కోకాపేట్ ప్రాంతంలో గత ఏడాది అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టూడియో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 

click me!