ఏజ్‌ని మింగేస్తున్న ఖుష్బు.. టీనేజ్‌ అమ్మాయిలా మారిపోయి కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుందిగా..

First Published Oct 1, 2021, 8:24 PM IST

సీనియర్‌ నటి ఖుష్బు సుందర్‌ ఏజ్‌ పెరిగే కొద్ది గ్లామర్‌ని పెంచేస్తుంది. టీనేజ్‌ అమ్మాయిలా మారిపోతుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు చూస్తే ఎవ్వరైనా అదే అంటారు. అనడమే కాదు ఫిదా అవుతున్నారు. 

ఖుష్బు సుందర్‌ తన స్టన్నింగ్‌ ఫోటోలతో నెట్టింట దుమారం రేపుతుంది. గ్రీన్‌ శారీలో క్యూట్‌ సెల్ఫీలతో ఫిదా చేస్తుంది ఖుష్బు. ఈ నయా గ్లామర్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. ఖుష్బు ఇటీవలే (సెప్టెంబర్‌ 29) తన 51వ పుట్టిన రోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఖుష్బుకి బర్త్ డే విషెస్‌ తెలియజేశారు. సింపుల్‌గానే తన బర్త్ డే ని కంప్లీట్‌ చేసుకుంది ఖుష్బు. 
 

ఏజ్‌ యాభై దాటినా ఆమె లుక్‌ పరంగా మాత్రం టీనేజ్‌ అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఖుష్బు. ఏజ్‌ని మింగేస్తుంది. అందంతో ఏజ్‌ని దాచేస్తూ టీనేజ్‌ అమ్మాయిలకు పోటీనిస్తుంది. ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోయిన్లకి పోటీనిస్తుంది. 
 

బాల నటిగా సినిమా కెరీర్‌ని స్టార్ట్ చేసింది ఖుష్బు. వెంకటేష్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన `కలియుగ పాండవులు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 

1970 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని బాంబేలో జన్మించింది కుష్బూ. ఈమెకు అసలు నఖత్ ఖాన్. ఆ తర్వాత కుష్బూగా పేరు మార్చుకుంది. 51వ పడిలో అడుగుపెట్టిన ఖుష్బు సుందర్ అప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దేవానంద్‌తో బాలనటిగా తెరంగేట్రం చేసింది. బాలనటిగా దేవానంద్‌తో పాటు పలువురు బాలీవుడ్ అగ్ర హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. బాలీవుడ్ నటుడు సునీల్ దత్‌తో బాలనటిగా కుష్బూ సుందర్. హీరోయిన్‌గా 36 యేళ్లు పూర్తి చేసుకున్న ఖుష్బూ  కథానాయికగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి చెన్నైలోనే ఉంటోంది. 
 

1991లో హీరో ప్రభుతో ఈమె నటించిన `చినతంబి` సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ప్రభుతో కొన్నాళ్లు డేటింగ్‌లో ఉంది. కానీ శివాజీ గణేషన్‌ జోక్యంతో వీరిద్దరు బ్రేకప్‌ చెప్పుకున్నారు. దాన్నుంచి బయటపడ్డాక 2000లో ఖుష్బూ దర్శకుడు, నటుడు సుందర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఖుష్బూ కాస్తా.. ఖుష్బూ సుందర్‌గా మారిపోయింది. వీళ్లకు అవంతికి, ఆనందిత అనే కూతుళ్లు న్నారు. 
 

తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాల్లో నటించింది ఖుష్బు. అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన `మేరీ జంగ్` సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో అలరించింది. అందులో `బోల్ బేబి బోల్` పాట ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత జాకీష్రాఫ్ హీరోగా తెరకెక్కిన `జాను` సినిమాలో మొదటిసారి హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత గోవిందాతో `తన్ బదన్` సినిమాలో నటించింది. ఇలా ఆమీర్ ఖాన్, మాధురి దీక్షిత్.. `దీవానా ముజ్సా నహీ` సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.

ఖుష్బూ తమిళనాడు ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అటు కేరళ ప్రభుత్వం నుంచి ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు దేశంలోని ఒక హీరోయిన్‌కు గుడి కట్టడం అనే సంప్రదాయం ఖుష్బూ నుంచే మొదలైంది. ఈ రకంగా తమిళుల ఆరాధ్య నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

`అజ్ఞాతవాసి`లో పవన్ కళ్యాణ్ కి తల్లి పాత్రలో ఖుష్బూ  నటించారు. అంతకు ముందు చిరంజీవి `స్టాలిన్` సినిమాలో చిరు అక్క పాత్రలో నటించింది. ఆ తర్వాత `యమదొంగ` సినిమాలో యమధర్మరాజు భార్య శ్యామలా దేవి పాత్రలో నటించింది. `కిరాయిదాదా` చిత్రంతో నాగార్జునతో జోడీ కట్టింది. 

2010లో DMK పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఖుష్బూ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత తమిళనాడు సార్వత్రిక ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. అంతేకాదు `థౌజండ్ లైట్స్` నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప డీఎంకే అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఖుష్పూ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నటించిన `అన్నాత్తే` సినిమాలో నటించింది. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ, అటు రాజకీయాలు, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తుంది.
 

click me!