ఎల్లో డ్రెస్‌లో కత్తిలాంటి చూపులతో ఎట్రాక్ట్ చేస్తోన్న శ్రీముఖి.. రాములమ్మకి పెళ్లి డిమాండ్‌

Published : Aug 24, 2025, 04:02 PM IST

శ్రీముఖి ఇప్పుడు ఇంటర్నెట్‌ అటెన్షన్‌ మొత్తం తన వైపు తిప్పుకుంది. లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
111
ఎల్లో డ్రెస్‌లో మెరిసిన శ్రీముఖి

స్టార్ యాంకర్‌ శ్రీముఖి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఎల్లో డ్రెస్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేసిన పిక్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

DID YOU KNOW ?
`ఖుషి` సీన్‌ రీ క్రియేట్‌
`ఖుషి` సినిమాలో నడుము చూసే సీన్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. `భోళాశంకర్‌` సినిమాలో చిరంజీవికి, శ్రీముఖికి మధ్య ఆ సీన్‌ పెట్టారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
211
కత్తిలాంటి చూపులతో శ్రీముఖి

శ్రీముఖి తాజా ఫోటోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె పోజులు అదిరిపోయేలా ఉన్నాయి. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది శ్రీముఖి. ఓరకంగా తన ఫాలోవర్స్ కి ఆమె మంచి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు.

311
బిగ్‌ బాస్‌ అగ్నిపరీక్ష కోసం శ్రీముఖి ఈ లుక్‌

`బిగ్ బాస్‌ అగ్నిపరీక్ష` షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి యాంకర్‌గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. ఈ షో కోసం రెడీ అయిన లుక్‌లో ఆమె ఈ ఫోటోలు దిగడం విశేషం. అగ్నిపరీక్ష లుక్స్ అంటూ ఆమె తన పోస్ట్ లో పేర్కొంది.

411
శ్రీముఖిపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు

ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఎల్లో డ్రెస్‌లో లుక్‌ అదిరిపోయిందని అంటున్నారు. ఇందులో చాలా క్యూట్‌గా ఉన్నావు శ్రీముఖి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. రోజు రోజుకు అందం పెరుగుతుందంటున్నారు.

511
శ్రీముఖికి పెళ్లి ప్రపోజల్స్

మరికొందరు కాస్త నాటీగా మారిపోతున్నారు. హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్‌ రాములమ్మ అని, ఇప్పటికే ఏజ్‌ బార్‌ అవుతుందని, త్వరగా చేసుకోవాలని సలహాలిస్తున్నారు. ఇంకోవైపు మనం పెళ్లి చేసుకుందామని మరికొందరు కామెంట్లు పెట్టడం విశేషం.

611
వైరల్‌గా మారిన శ్రీముఖి ఫోటోలు

మొత్తంగా శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద రచ్చ చేస్తుండటం విశేషం. ఫ్యాన్స్ ని కూడా అంతే బాగా ఆకట్టుకుంటున్నాయి. వారంతా ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు.

711
బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా శ్రీముఖి

శ్రీముఖి ఇప్పుడు తెలుగు బుల్లితెరపై అత్యంత బిజీ యాంకర్‌గా రాణిస్తోంది. అత్యంత డిమాండ్‌ ఉన్న యాంకర్‌గానూ నిలిచింది. ఒకప్పుడు ఒక్క షో కూడా లేక ఖాళీగా ఇంట్లో ఉండిపోయింది. కరోనా సమయంలో శ్రీముఖి వద్ద ఒక్క షో కూడా లేవు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకుంది.

811
బుల్లితెర ఛానెల్స్ శ్రీముఖి బెస్ట్ ఆప్షన్‌

ఆ తర్వాత ఒక్కో షోని దక్కించుకుంటూ తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంది. వరుసగా ఈటీవీ, స్టార్‌ మా, జెమినీ, జీ తెలుగు టీవీలోని షోస్‌ దక్కించుకుంటూ వస్తోంది. ఇప్పుడు ఆమె వద్ద చాలా షోస్‌ ఉన్నాయి. బుల్లితెర ఛానెల్స్ శ్రీముఖి బెస్ట్ ఛాయిస్‌గా మారింది. 

911
ఆదివారం స్టార్‌ మా పరివారం విశేష గుర్తింపు

స్టార్‌ మాలో ప్రసారం అయ్యే ఆదివారం స్టార్‌ మా పరివారం షోకి చాలా కాలంగా యాంకరింగ్‌ చేస్తుంది శ్రీముఖి. ఇది ఆమెకి మెయిన్‌ షోగా నిలుస్తుందని చెప్పొచ్చు. వీటితోపాటు కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్, సరిగమపతోపాటు పలు ఇతర షోస్‌కి కూడా యాంకరింగ్‌ చేసి ఆకట్టుకుంది.

1011
చిరంజీవితో `భోళా శంకర్‌`లో

మరోవైపు అడపాదడపా సినిమాలు కూడా చేస్తోంది శ్రీముఖి. ఆ మధ్య చిరంజీవి `భోళా శంకర్‌` చిత్రంలో మెరిసింది. ఇందులో చిరంజీవితో `ఖుషి` ఎపిసోడ్‌ రీ క్రియేట్‌ చేసి రచ్చ చేసింది. అలాగే `మ్యాస్ట్రో` మూవీలోనూ కీలక పాత్ర పోషించింది.

1111
సినిమాలు కాదు టీవీతో విశేష గుర్తింపు

అయితే సినిమాలు పెద్దగా గుర్తింపు తేలేకపోయాయి. బుల్లితెరనే ఆమెని స్టార్‌ని చేసింది. దీంతో సినిమాలు పక్కన పెట్టి టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది శ్రీముఖి. క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఓ వైపు బుల్లితెరపై, ఇంకోవైపు సోషల్‌ మీడియాలో ఫోటోలతోనూ ఆకట్టుకుంటూ తన ఫ్యాన్స్‌ ని, ఫాలోవర్స్ ని నిత్యం ఎంగేజ్‌ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories