జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈ చిత్రంలో లాజిక్ లేని సీన్ల గురించి వర్మ ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే వార్ 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ మొదలైంది. రిలీజ్ కి ముందు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వార్ చిత్రం ఘనవిజయం కావడంతో దానికి సీక్వెల్ గా వస్తున్న వార్ 2 అంతకి మించేలా ఉంటుందని ఫ్యాన్స్ భావించారు.
25
వార్ 2పై రాంగోపాల్ వర్మ రివ్యూ
కానీ ఈ మూవీ ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. మరోవైపు కూలీ చిత్రం నుంచి పోటీ ఉండడం వల్ల వార్ 2 కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ప్రస్తుతం ఈ చిత్రం నష్టాల బాటలో పయనిస్తోంది. వార్ 2 పరాజయం చెందడానికి కారణం వివరిస్తూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
35
జపాన్ వాళ్ళతో ఫైట్ ఏంటి ?
వార్ 2 మూవీ తాను చూశానని లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నాయని వర్మ అన్నారు. హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్పై యూనివర్స్ మూవీ అంటే ఇండియా ఏజెంట్ గా ఉన్న హీరో మన దేశానికి శత్రు దేశాలతో పోరాడాలి. కానీ హృతిక్ ఎంట్రీ సీన్ లో జపాన్ వాళ్ళతో భారీ ఫైట్ పెట్టారు. అసలు ఇండియాకి జపాన్ ఎప్పుడు శత్రు దేశంగా మారిందో నాకు అర్థం కాలేదు. కనీసం ఆ ఫైట్ ఎందుకు పెట్టారో అనేదానిపై సరైన వివరణ ఉండాల్సింది. అది కూడా జరగలేదు.
ఇలాంటి లాజిక్ లేని సీన్లు వార్ 2లో చాలా ఉన్నాయి. అందుకే సినిమా ఎంత భారీగా ఉన్న ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు అని వర్మ అన్నారు. వార్ 2 మాత్రమే కాదు.. ఇప్పుడు వస్తున్న చాలా చిత్రాలు అలాగే ఉన్నాయి. అందరికీ పాన్ ఇండియా అనే జబ్బు పట్టింది అని వర్మ విమర్శించారు. వార్ 2లో హృతిక్ రోషన్ కి జపాన్ వాళ్ళతో ఫైట్ ఎందుకు పెట్టారు అని నేను కొంతమందిని అడిగాను.
55
యానిమల్ బాగా నచ్చింది
నేను ఎవరితో మాట్లాడాను అనేది అనవసరం.. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే జపాన్ వాళ్ళతో ఫైట్ అంటే వెరైటీగా ఉంటుంది అని పెట్టినట్లు చెప్పారు. కానీ సరైన లాజిక్ మాత్రం చెప్పలేకపోయారు. ఇటీవల కాలంలో తనకి యానిమల్ చిత్రం బాగా నచ్చింది అని వర్మ అన్నారు. పుష్ప 2లో అల్లు అర్జున్ అద్భుతంగా చేశాడు. దేవర కూడా చూశాను. అది మంచి కథే కానీ ఏదో చేయాలని ఇంకేదో చేశారు అంటూ వర్మ అభిప్రాయ పడ్డారు.