ఈ వారం థియేటర్లలో సినిమాల జాతర, రిలీజ్ కు రెడీగా నారా రోహిత్, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ సినిమాలు

Published : Aug 24, 2025, 03:15 PM IST

ఈవారం థియేటర్లలో సినిమాల జాతర జరగబోతోంది. భారీ బడ్డెజ్ సినిమాలు లేకున్నా.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ సందడి చేయబోతున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

PREV
15

సుందరాకాండ

నారా రోహిత్ (Nara Rohith) హీరోగా తెరకెకెక్కిన తాజా మూవీ సుందరాకాండ. రోహిత్ కు ఇది మైల్ స్టోన్ 20వ మూవీ. ఈ సినిమాను కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి కలిసి సుందరకాండ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈమూవీ వినాయక చవితి కానుకగా ఈనెల 27న రిలీజ్ కాబోతోంది.

25

రివాల్వర్ రీటా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'రివాల్వర్ రీటా'. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు రాధికా శరత్‌కుమార్ , రెడిన్ కింగ్స్లీ , మైమ్ గోపి , సెంద్రాయన్ , సూపర్ సుబ్బరాయన్  ఇతరులు సహాయక పాత్రల్లో నటించారు సినిమా, గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్టు 27, 2025 న విడుదల కానుంది. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చూడవచ్చు.

35

కన్యా కుమారి

తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది కన్యా కుమారి సినిమా. దామోదర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ చరణ్ రాచకొండ గీత్ సైని ప్రధాన పాత్రల్లో నటించారు, భద్రం, మురళీధర్ గౌడ్ తో పాటు మరికొంత మంది స్టార్స్ సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి నిడమర్తి సంగీతం అందించగా రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై దామోదర ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా వినాయక చవితి కానుకగా ఈనెల 27న రిలీజ్ కాబోతోంది.

45

పరమ్ సుందరి

ఇక 29న రిలీజ్ కాబోతున్న సినిమాల్లో స్పెషల్ గా చెప్పుకునే సినిమా పరమ్ సుందరి. జన్వీ కపూర్ , సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటించిన రొమాంటిక్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ లో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా సౌత్ ఆడియన్స్ ను కూడా ఆకర్శించే విధంగా పరమ్ సుందరి మూవీని రూపొందించారు టీమ్. నార్త్ ఇండియన్ యంగ్ స్టర్ పరమ్ తో మలయాళీ యువతి సుందరి మధ్య ప్రేమకథగా ఈసినిమా రూపొందించబడింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గౌరవ్ మిశ్రా , ఆర్ష్ వోరా స్క్రిప్ట్ రచన చేశారు. ఇప్పటికే మలయాళంలో వివాదంగా మారిన పరమ్ సుందరి సినిమా ఈనెల 29న థియేటర్లలో సందడి చేయబోతుంది.

55

త్రిబాణధారి బార్బరిక్

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ సినిమాకి మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa Director Interview)దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి స్టార్స్ ప్రముఖ పాత్రలను పోషించారు. ఆగస్ట్ 29న ఈసినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories