Sreemukhi: అనసూయకి షాకిస్తున్న శ్రీముఖి.. శ్రియాతో రాములమ్మ నాన్‌ స్టాప్‌ హంగామా.. యాంకర్ల రచ్చ అన్‌లిమిటెడ్‌

Published : Nov 26, 2021, 09:24 PM IST

హాట్‌ యాంకర్స్ అనసూయ, శ్రీముఖి పోటీ పడుతున్నారు. ఇద్దరూ నువ్వా నేనా అంటున్నారు. అయితే ఇందులో అనసూయని మించిపోతుంది శ్రీముఖి. పెద్ద పెద్ద గెస్ట్ లతో అనసూయకే షాకిస్తుంది. అనసూయ షోకి దీటుగా రాణిస్తుంది.   

PREV
17
Sreemukhi: అనసూయకి షాకిస్తున్న శ్రీముఖి.. శ్రియాతో రాములమ్మ నాన్‌ స్టాప్‌ హంగామా.. యాంకర్ల రచ్చ అన్‌లిమిటెడ్‌

శ్రీముఖి(Sreemukhi).. ప్రస్తుతం తెలుగు టాప్‌ యాంకర్స్ లో ఒకరు. సుమని పక్కని పెడితే.. యాంకర్‌ అనసూయ(Anasuya)తో పోటీ పడుతుందీ భారీ అందాల భామ. ప్రస్తుతం శ్రీముఖి.. `కామెడీ స్టార్స్` షోకి హోస్ట్ గా చేస్తుంది. దీంతోపాటు ఓటీటీ `ఆహా`లో వంటల ప్రోగ్రామ్‌కి హోస్ట్ గా చేస్తుంది. `చెఫ్‌ మంత్ర` పేరుతో రన్‌ అవుతున్న వంటల కార్యక్రమానికి Sreemukhi యాంకర్‌గా చేస్తుంది. దీనికి మంచి స్పందన వస్తుండటం విశేషం. 

27

తాజాగా ఈ షోకి గెస్ట్ గా శ్రియాని తీసుకొచ్చింది శ్రీముఖి. ఈ సందర్భంగా శ్రియాతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ బ్యూటీఫుల్‌ ఉమెన్‌తో వంటల ప్రోగ్రామ్‌ చేస్తున్నట్టు తెలిపింది శ్రీముఖి. ప్రస్తుతం ఇది స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది. తన హ్యాపీనెస్‌ని పంచుకుంది శ్రీముఖి. 
 

37

ఇందులో శ్రియా ట్రాన్ఫరెంట్‌ బ్లాక్‌ డ్రెస్‌లో హోయలు పోతుంది. మరోవైపు శ్రీముఖి సైతం హాట్‌గా కనిపిస్తూ అదరహో అనిపిస్తుంది. శ్రీముఖి తీసుకున్న ఈ సెల్ఫీ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

47

ఇదిలా ఉంటే వంటల కార్యక్రమంలో శ్రీముఖి దూసుకుపోతుందట. మరో సెక్సీ యాంకర్‌ అనసూయ దాటేసుకుని `చెఫ్‌ మంత్ర` షోని పరుగులు పెట్టిందని టాక్‌ నడుస్తుంది. తెలుగులో అత్యంత క్రేజ్‌ ఉన్న అనసూయ షోని మించి శ్రీముఖి పరుగులు పెట్టిస్తుందని చర్చ నడుస్తుంది. 
 

57

Anasuya ప్రస్తుతం జెమినీ టీవీలో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు` అనే పాపులర్‌ ఇండియన్‌ వంటల ప్రోగ్రామ్‌కి హోస్ట్ గా చేస్తుంది. ఈ షోకి ముందుగా తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆమె సారథ్యంలో షోకి టీఆర్‌పీ రేటింగ్‌ రావడం లేదని మధ్యలోనే ఆమెని తొలగించారు. ఇది వివాదాస్పదంగానూ మారింది. ఈ విషయంలో తమన్నా కోర్ట్ కి కూడా వెళ్తున్నట్టు ఆ మధ్య ప్రచారం జరిగింది. 

67

మరోవైపు అనసూయని తీసుకొచ్చి కూడా నెల రోజులు దాటింది. అయినా రేటింగ్‌ విషయంలో ఏమాత్రం పురోగతి లేదట. పైగా తమన్నా ఉన్నప్పుడు కంటే తక్కువగా నమోదవుతుందనే టాక్‌ కూడా వినిపిస్తుంది. `జబర్దస్త్`షో విషయంలో ఉర్రూతలూగించే అనసూయ ఈ వంటల షోని పరుగులు పెట్టించే విషయంలో వెనకబడ్డారనే కామెంట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

77

మరోవైపు శ్రీముఖి మాత్రం తన వంటల షోని మాత్రం విజయవంతంగా రన్‌ చేస్తుందని, దీనికి మంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. అయితే శ్రీముఖి బ్యాక్‌ టూ బ్యాక్‌ సెలబ్రిటీలను దింపుతుంది. వారి వంటల స్పెషల్స్ ని ఆడియెన్స్ కి పరిచయం చేస్తుంది. దీంతో ఈ షో బాగా కనెక్ట్ అవుతుందని, చాలా మంది వీక్షిస్తున్నారని సమాచారం. ఈ లెక్కన శ్రీముఖి.. వంటల విషయంలో అనసూయని మించి దూసుకుపోతుందని సమాచారం. 

also read: Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్‌ అక్కినేని కాంపౌండ్‌లోకి సమంత.. హాట్‌ టాపిక్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories