Samantha: విడాకుల తర్వాత ఫస్ట్ టైమ్‌ అక్కినేని కాంపౌండ్‌లోకి సమంత.. హాట్‌ టాపిక్‌

First Published | Nov 26, 2021, 6:42 PM IST

సమంత షాకిచ్చింది. అక్కినేని కాంపౌండ్‌లో అడుగుపెట్టింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఫస్ట్ టైమ్‌ సమంత అక్కినేని స్టూడియోలో అడుగుపెట్టడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. స్వరత్రా చర్చనీయాంశంగా మారడంతోపాటు ఎందుకు వెళ్లిందనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. 

సమంత(Samantha) వరుసగా భారీ సినిమాలతో దూసుకుపోతుంది. ఎలాంటి హద్దుల్లేకపోవడంతో తనకు నచ్చిన విధంగా ముందుకు సాగుతుంది. నచ్చిన సినిమాలు చేయడం, తన మనసు చెప్పింది ఫాలో అవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే Samantha రెండు భారీ బైలింగ్వల్‌ సినిమాలను ప్రకటించింది. తాజాగా మరో ఇంటర్నేషనల్‌ చిత్రాన్ని ప్రకటించి అందరికి షాకిచ్చింది. బాలీవుడ్‌ అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్‌ సినిమా అనౌన్స్ చేసి షాకిచ్చింది సమంత. అందులో భాగంగా సమంత ప్రముఖ అంతర్జాతీయ దర్శకుడు ఫిలిప్‌ జాన్‌ దర్శకత్వంతో ఓ సినిమాని ప్రకటించింది. ఈ సినిమాకి `ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్‌ లవ్‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇందులో సమంత లీడ్‌ రోల్‌ చేయడం విశేషం. 

Thirupathi to Thirumala walking path

ఈ విషయాన్ని పంచుకుంటూ సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. జాన్‌ ఫిలిప్‌ సర్‌తో పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పింది సమంత. దీంతో సమంత అభిమానులు సంబరపడుతుంటే, చైతూ ఫ్యాన్స్ మాత్రం షాక్‌లోకి వెళ్లిపోయారట. ఈ చిత్రానికి `ఓ బేబీ` చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా పనిచేసిన సునీత తాటి తన గురు ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం విశేషం. ఇందులో సమంత బోల్డ్ రోల్‌ చేస్తుందట. ఓ నవల ఆధారంగా తీయబోతున్న ఈ సినిమాలో.. సాంప్రదాయ కుటుంబ నుంచి వచ్చిన అమ్మాయి స్వతంత్రంగా ఉండాలని భావిస్తుంది. కానీ ఫ్యామిలీ తనకి అరేంజ్‌ మ్యారేజ్‌ చేయాలనుకుంటారు. కానీ ఆమె బైసెక్స్‌వల్‌గా ఉంటుంది. ఇలాంటి బోల్డ్ రోల్‌లో సమంత కనిపించబోతుందని టాక్‌. 


ఇదిలా ఉంటే తాజాగా సమంత అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేసింది. నాగచైతన్యతో విడాకుల ప్రకటించిన అనంతరం ఫస్ట్ టైమ్‌ ఆమె అక్కినేని కాంపౌండ్‌లో అడుగు పెట్టడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. అయితే సమంత ఎందుకు వెళ్లారనేది ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 

సమంత ప్రస్తుతం తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటించింది. శకుంతల అనే పాత్రలో ఆమె కనిపించబోతుంది. సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అయితే ఇందులో తన పాత్రకి డబ్బింగ్‌ చెప్పేందుకు సమంత అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిందట. అయితే ఎవరికీ తెలియకుండా, ఎవరి కంటపడకుండా చాలా సైలెంట్‌గా వచ్చి, తన పనిచూసుకుని వెళ్ళిపోతుందని టాక్‌. ఒక్కసారి దూరమయ్యాక మళ్లీ అక్కడికి వెళ్లడం చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకి రావడంలో సమంత కూడా అదే ఫీల్‌ అవుతుందట. దీంతో సైలెంట్‌గా పనిచూసుకుని వెళ్తుందని సమాచారం. 
 

సమంత, నాగచైతన్య ప్రేమించుకుని 2017 అక్టోబర్‌ 6న మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు హిందూ, క్రిస్టియన్‌ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం చాలా గ్రాండ్‌గా జరిగింది. నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా, ఆదర్శజంటగా ఉన్న వీరిద్దరు ఊహించని విధంగా ఈ అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు ప్రకటించి షాకిచ్చారు. అంతకు ముందు మూడు నెలలుగా వీరిద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందని, విడిపోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై అటు సమంతగానీ, ఇటు చైతూ గానీ స్పందించలేదు. డైరెక్ట్ గా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాకిచ్చారు. 
 

ఆ తర్వాత ఇప్పుడు ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా ఉన్నారు. సమంత ఇప్పటికే `శాకుంతలం`తోపాటు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రాల్లో నటించింది. ఇటీవల తెలుగు, తమిళంలో రెండు బైలింగ్వల్‌ చిత్రాలను అనౌన్స్ చేసింది. దీంతోపాటు అల్లు అర్జున్‌ `పుష్ప` చిత్రంలో స్పెషల్‌ నెంబర్‌ చేస్తుంది. ఇది మరో లెవల్‌లో ఉండబోతుందని సమాచారం. ఇక చైతూ ఇప్పుడు `థ్యాంక్యూ` సినిమాలో, `బంగార్రాజు` సినిమాలో నటిస్తున్నారు. 

also read: Samantha: బోల్డ్ రోల్ తో సమంత హాలీవుడ్ ఎంట్రీ.. డేరింగ్ డెసిషన్, శృంగార పరమైన అంశంతో..

Latest Videos

click me!