కథ :
విదేశీయుడు ఆండీ ఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు) ఇండియా వచ్చి భారతదేశ స్త్రీల గొప్పతనానికి ముగ్దుడై, తెలుగు అమ్మాయిని పెళ్ళాడి వంశాన్ని వృద్ధి చేస్తాడు. ఆండీ ఫ్లవర్ మనవడు క్యాలీఫ్లవర్ (సంపూర్ణేష్ బాబు) తన తాతయ్య చెప్పిన విధంగా బతుకుతూ 35 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేసుకునేది లేదని, తన శీలాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. అలాంటి క్యాలీఫ్లవర్ ను ముగ్గురు అమ్మాయిలు అతి దారుణంగా మానభంగం చేస్తారు. దాంతో తన శీలాన్ని దోచుకున్నారని తనకు న్యాయం చేయాలని క్యాలీఫ్లవర్ పోరాట బాట పడతాడు. ఈ క్రమంలో క్యాలీఫ్లవర్ పోరాటంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? క్యాలీఫ్లవర్ ను మానభంగం చేసిన ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు ? చివరకు క్యాలీఫ్లవర్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.
సంపూ సినిమా అంటే ప్రేక్షకులకు ఒక ఐడియా ఉంటుంది. పేరడీలతో కామెడీ పంచడమే తన సినిమాల పరమార్ధం. సంపూ మొదటి చిత్రం హృదయ కాలేయం నుండి ఇదే ఫార్ములా వాడుతున్నారు. ఐతే అన్ని సమయాలలో అది వర్క్ అవుట్ కావడం లేడు.
2019 లో సంపూ నటించిన కొబ్బరి మట్ట ఆయనకు మంచి విజయాన్ని అందించింది. కొబ్బరి మట్ట మోహన్ బాబు పెదరాయుడు చిత్రానికి స్పూఫ్. మూడు డిఫరెంట్ రోల్స్ లో సంపూ అలరించాడు. అదే తరహాలో క్యాలీఫ్లవర్ మూవీతో మ్యాజిక్ చేయాలని చూశారు. కానీ ఈ సారి ఆయన ప్రయత్నం సఫలం కాలేదు.
ఏదైనా ఒకసారి చేస్తే కొత్త పదేపదే చేస్తే జనాలు హర్షించరు. ఎప్పటిలాగే లాజిక్ లేని సీన్స్, కామెడీతో కూడిన హైవోల్టేజ్ డైలాగ్స్ తో సినిమా నింపేశారు. ఆడల్ట్ కామెడీ డైలాగ్స్ కూడా జొప్పించారు. అవేమి హాస్యం పండించలేకపోయాయి. ఇక నగ్నంగా కనిపించి సంపూ సాహసం చేశాడు. డైలాగ్స్ ఇరగదీశాడు. సినిమా మొత్తం మరో పాత్ర కనిపించకుండా... సంపూనే కనిపిస్తాడు.
ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయిని బట్టి ఉన్నాయి. ఎడిటింగ్, మ్యూజిక్ పర్వాలేదు. సంపూ సినిమాలలో లాజిక్ ఉండదు. దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం. అయితే స్లో నెరేషన్, ఆకట్టుకోని కథనం సినిమాను దెబ్బతీశాయి. సంపూ డై హార్డ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ నచ్చవచ్చు. వాళ్ళు ఒకసారి చూసి సంపూ చేసే చిత్రాలు ఎంజాయ్ చేయవచ్చు.