శ్రీముఖిని ముద్దుల్లో ముంచెత్తిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌.. రాములమ్మ రచ్చ మామూలుగా లేదుగా!

Published : Sep 12, 2022, 10:26 AM IST

యాంకర్‌ శ్రీముఖి ఆనందంలో మునిగితేలుతుంది. ఉబ్బితబ్బిబ్బవుతుంది. తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్‌తో హ్యాపీగా ఫీలవుతుంది. తాజాగా ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. 

PREV
17
శ్రీముఖిని ముద్దుల్లో ముంచెత్తిన బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌.. రాములమ్మ రచ్చ మామూలుగా లేదుగా!

తెలుగులో స్టార్‌ యాంకర్ గా రాణిస్తుంది శ్రీముఖి(Sreemukhi). సుమ కనకాల తర్వాత ఆ రేంజ్‌లో వరుస షోలతో ఆకట్టుకుంటుంది. యాంకర్‌గా దుమ్ములేపుతుంది. రాములమ్మగా పాపులారిటీని సొంతం చేసుకుని తెలుగు బుల్లితెరని ఏలుతుంది Anchor Sreemukhi. తాజాగా ఈ అమ్మడు చేసిన పని ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

27

శ్రీముఖి `సైమా2022`(SIIMA2022)లోనూ యాంకర్‌గా చేసింది. కమెడియన్‌ అలీతో కలిసి ఆమె యాంకరింగ్‌ చేసింది. సౌత్‌ ఇండియన్‌ మూవీలకు సంబంధించిన అందించే అవార్డు ఫంక్షన్‌లో శ్రీముఖి బ్లాక్‌ ట్రెండీ వేర్‌లో రచ్చ చేసింది. హోయలు పోతూ అవార్డు వేడుకలో మొత్తం హైలైట్‌గా నిలిచింది.
 

37

ఈ సందర్బంగా అవార్డు ఇచ్చేందుకు స్టేజ్‌పైకి వచ్చిన రణ్‌వీర్‌ సింగ్‌(Ranveer Singh)ని తన వద్దకి పిలిచింది శ్రీముఖి. అమ్మాయిలంతా జెలసీ ఫీలయ్యేలా మీరు ఒకటి చేయాలని తెలిపింది. దీంతో రెచ్చిపోయిన రణ్‌వీర్‌ సింగ్‌ ఆమెకి హగ్గులిచ్చారు. అంతటితో ఆగలేదు ముద్దులతో ముంచెత్తాడు. శ్రీముఖి రెండు చేతులకు ముద్దులివ్వడం విశేషం.
 

47

దీంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది శ్రీముఖి. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ సందర్బంగా దీపికా పదుకొనెమ్మా చూస్తున్నావా? అంటూ అలీ వేసిన పంచ్‌లో నవ్వులు పూయించాయి.  ప్రస్తుతం ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది శ్రీముఖి. ఇప్పుడు ఏం జరిగింది? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, రణ్‌వీర్‌ సింగ్‌కి లవ్యూ చెప్పింది హాట్‌ యాంకర్‌. దీనికి కారణమైన సైమాకి థ్యాంక్స్ చెప్పింది.
 

57

అదృష్టం అంటే శ్రీముఖిదే అని, ఫైనల్లీ శ్రీముఖి సాధించిందని, శ్రీముఖి ఇప్పుడు హ్యాపీయేనా? అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.  ఇక శ్రీముఖి మరోవైపు టీవీ షోస్‌లతోనూ బిజీగా ఉంది. ఆమె ఈటీవీ, మా టీవీ, జెమినీ, జీ తెలుగు ఇలా ఛానెల్‌తో సంబంధం లేకుండా వరుసగా వినోదాత్మక షోలకు యాంకర్‌గా చేస్తుంది. 

67

ప్రస్తుతం ఆమె చేస్తున్న వాటిలో `జాతిరత్నాలు`, `సరిగమప` ప్రధానంగా ఉండగా, కొత్తగా `డాన్సు ఐకాన్‌` ప్రారంభమైంది. వీటితోపాటు సండే స్పెషల్‌ ఈవెంట్లలోనూ యాంకర్‌గా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉందీ రాములమ్మ. పండుగలకు, ప్రత్యేకమైన రోజులకు షో ఏదైనా యాంకర్‌గా బెస్ట్ ఆప్షన్‌ శ్రీముఖిగా మారుతుండటం విశేషం. 
 

77

మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుందీ ముదురు భామ. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `క్రేజీ అంకుల్స్‌`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం చిరంజీవితో `భోళాశంకర్‌` సినిమా చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories