
తెలుగు అందాల యాంకర్ శ్రీముఖి క్రేజ్ ఇప్పుడు మామూలు కాదు. సుమ డౌన్ కావడం, అనసూయ షోస్ వదిలేయడం, రష్మి ఒకటి రెండు షోస్‌కే పరిమితం కావడంతో ఇప్పుడు శ్రీముఖి జోరు కొనసాగుతుంది. ఆమె నాలుగైదు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. మిగిలిన యాంకర్లని మించిన పాపులారిటీతో దూసుకుపోతుంది.
ఓ వైపు షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అడపాదడపా పెద్ద తెరపై మెరస్తూ అలరిస్తుంది. తన కోరికని తీర్చుకుంటుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులకు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వారిని ఎంగేజ్ చేస్తుంది. దీంతో ఆమె ఫోటోలు నెటిజన్లకి విందు భోజనంలా పనిచేస్తాయి.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీముఖి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. దీంతోపాటు ఆమె ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్నప్పటి పిక్స్ నెటిజన్లని అలరిస్తున్నాయి. ఉమెన్స్ డే సందర్భంగా తన అమ్మ లతా శ్రీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది శ్రీముఖి. ఈ మేరకు ఆమె ఎమోషన్ పోస్ట్ పెట్టింది.
చిన్నప్పుడు అమ్మతో ఉన్న ఫోటోలు ఇవి. ఇందులో శ్రీముఖి చిన్నప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. ఆమె ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. అదే అల్లరి, చిలిపితనం కనిపిస్తుంది. శ్రీముఖి చిన్నప్పటి ఫోటోలు ఆమె అభిమానులను అలరిస్తూ, నెటిజన్లని గిలిగింతలు పెడుతున్నాయి. ఇక ఇందులో అమ్మ గురించి శ్రీముఖి రాసుకొచ్చిన పోస్ట్ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది.
అమ్మ గురించి చెబుతూ, ఊహ తెలిసినప్పనుంచి నాకు తెలిసిన నేను చూసి అందమైన రూపం అమ్మ. మా అమ్మ ప్రయాణం మొదటి నుంచి చూశాను. ఆమె ఎక్కడో చిన్న స్థాయి నుంచి ఇంత వరకు వచ్చి నాకు స్ఫూర్తినచ్చింది. ఈ రోజులు తనకు ఇంత మంది ఫాలోవర్స్ కి దగ్గర చేసింది. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద కలలను వెంట చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. అభిరుచి, దృఢ సంకల్పంతో అందాల కళ నేర్చుకుని బ్యూటీషియన్‌గా ఎదిగింద`ని పేర్కొంది.
ఇంకా కొనసాగిస్తూ, నెమ్మదిగా, స్థిరంగా బ్యూటీషియన్ వృత్తిలో ప్రావీణ్యం పొందింది. ఈ రోజు చాలా మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింద. వారి జీవితాల్లో మార్పు తెచ్చింది. నాకు, నా కుటుంబానిఇక విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి ఆమె లెక్కలేనని విరామం లేని రోజులు గడిపింది. ఎంతో త్యాగం చేసింది. ఒక్క సారి కూడా ఆమె నాకు నో చెప్పినట్టు గుర్తుకు లేదు.
నేను బొద్దుగా ఉండే యుక్త వయసులో ఉన్నా, ఇతరులు నన్ను బాడీ షేమ్ చేసినప్పుడు ఆమె ఎప్పుడు నా వెంటే ఉంది. ఆ క్లిష్ట సమయంలోనూ నన్ను ప్రోత్సహించింది. ప్రేమించింది, పాంపర్ చేసింది. ఇంకా నన్ను బలపరిచింది. త్వరలో ఆమెకి 50ఏళ్లు నిండుతాయి. ఆమె అడ్డంకులను ఛేదిస్తూ, ప్రతి రోజూ నన్ను మరింతగా ప్రేరేపిస్తుంది. నేను ఈ జీవితానికి రుణపడి ఉన్నాను అమ్మా.
ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అద్భుతమైన పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అమ్మా` అని పేర్కొంది శ్రీముఖి. ఎమోషనల్‌గా కామెంట్ చేసింది. ఇది వైరల్ అవుతుంది. ఇది చూసి నెటిజన్లు స్పందిస్తూ శ్రీముఖికి అందగా నిలుస్తున్నారు. ఆమె గ్రేట్ అంటూ కితాబిస్తున్నారు.