MaheshBabu New Look: హాలీవుడ్‌ హీరోలను డామినేట్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌ నయా లుక్‌.. రాజమౌళి మూవీ కోసమేనా?

Published : Mar 08, 2024, 08:28 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఇటీవల కొత్త లుక్‌ల్లో కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్త లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.   

PREV
15
MaheshBabu New Look: హాలీవుడ్‌ హీరోలను డామినేట్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌ నయా లుక్‌.. రాజమౌళి మూవీ కోసమేనా?

మహేష్‌ బాబు ఇటీవల `గుంటూరు కారం`లో కాస్త ఊరమాస్‌ లుక్‌లో కనిపించారు. ఆయన పాత్ర కూడా అంతే మాస్‌గా ఉంది. అయితే రాజమౌళి సినిమా కోసం ఆయన పూర్తిగా మారిపోతున్నారని అంటున్నారు. ఇటీవల ఆయన మేకోవర్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. విదేశీ ట్రైనర్‌ సమక్షంలోనూ మహేష్‌ శిక్షణ తీసుకున్నారు. 

25

ఆ మధ్య ఎయిర్‌ పోర్ట్ లో, ఇతర కార్యక్రమాల్లో కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో రాజమౌళితో చేయబోయే `ఎస్‌ఎస్‌ఎంబీ29` సినిమా కోసమే ఈ లుక్‌ అనే వార్తలొచ్చాయి. కాస్త గెడ్డంతోనూ కనిపించాడు మహేష్‌. అందులో ఆఫ్రికన్‌ అడవుల్లో సాహసికుడిగా కనిపిస్తాడనే వార్తల నేపథ్యంలో అదే ఆయన లుక్కేమో అనుకున్నారు. 

35

అయితే ఈ మూవీ కోసం ఎనిమిది రకాల లుక్‌ టెస్ట్ లను ఎంపిక చేశారట. ఇందులో ఫైనల్‌గా ఒక దాన్ని ఎంపిక చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో మహేష్‌ సడెన్‌గా లుక్‌ మార్చాడు. సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. బ్లాక్‌ కోట్‌ ధరించి, స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించాడు మహేష్‌. హాలీవుడ్‌ హీరోలను మించి కనిపిస్తున్నాడు. మోస్ట్ హ్యాండ్సమ్‌గా ఆయన లేటెస్ట్ లుక్‌ ఉండటం విశేషం.

45

తాజాగా మహేష్‌ బాబు తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా దీన్ని పంచుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన అభిమానులను ఈ లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతూ, ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. దీనిపై వాళ్లు కామెంట్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ హీరోలు కూడి దిగదుడుపే అంటున్నారు. 
 

55

అదే సమయంలో రాజమౌళి సినిమా కోసం చేసిన లుక్‌ ఇదేనా? అనే డౌట్‌ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైనా బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం కూడా ఇలాంటి ఫోటో షూట్లు చేస్తుంటారు? మరి ఈ నయా లుక్‌ దేని కోసమనేది తెలియాల్సి ఉంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు చేయబోయే సినిమా త్వరలోనే ప్రారంభం కానుందట. ఉగాదికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీని వెయ్యికోట్ల భారీ బడ్జెట్‌తో కేఎల్‌ నారాయణ నిర్మించబోతున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories