అనసూయ, రష్మిలకు ఝలక్‌ ఇచ్చిన శ్రీముఖి.. హాట్‌ యాంకర్ల వల్ల కానిది రాములమ్మకి సాధ్యం..

Published : Aug 26, 2022, 06:05 PM IST

తెలుగు టీవీ యాంకర్లలో హాట్‌ యాంకర్లుగా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్‌, రష్మి గౌతమ్‌లకు ఊహించని షాకిచ్చింది శ్రీముఖి. వారికి సాధ్యం కానిది తను నిరూపించింది. ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
15
అనసూయ, రష్మిలకు ఝలక్‌ ఇచ్చిన శ్రీముఖి.. హాట్‌ యాంకర్ల వల్ల కానిది రాములమ్మకి సాధ్యం..

బుల్లితెర రాములమ్మగా ఫేమస్‌ అయ్యింది శ్రీముఖి(Sreemukhi). బొద్దు అందాలతో, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా ఉంటూ, వెలకట్టలేని  అల్లరితనంతో బుల్లితెరపై సందడి చేస్తుంటుంది. ఆడియెన్స్ కి కావాల్సిన వినోదాన్ని పంచుతుంది శ్రీముఖి. ఆమె షోకి యాంకర్‌గా చేసిందంటే అది క్లిక్‌ అవ్వాల్సిందే. టీఆర్‌పీలో పరుగులు పెట్టాల్సిందే. ఇప్పటికే అనేక షోలకు హోస్ట్ గా చేస్తూ వచ్చిన శ్రీముఖి ప్రస్తుతం సరిగమప,  జాతిరత్నాలు వంటి షోలకు యాంకర్‌గా చేస్తుంది. 

25

అదే సమయంలో స్పెషల్‌ ఈవెంట్లకి, స్టార్‌ మా, జీ తెలుగు, జెమినీ వంటి టెలివిజన్స్ లో ఫెస్టివల్‌ ప్రోగ్రామ్‌లకు తనే యాంకర్‌గా చేస్తుంటుంది. అదిరిపోయే డాన్సు స్టెప్పులతో ఆకట్టుకుంటుంది. పంచ్‌లతో నవ్వులు పూయిస్తుంది. ఈ క్రమంలో కెరీర్‌ పరంగా మరో అడుగు ముందుకేసింది. 

35

శ్రీముఖి ప్రస్తుతం జడ్జ్ గా మారిపోయింది. ఆమె డాన్సు ఐకాన్‌కి జడ్జ్ గా వ్యవహరిస్తుండటం విశేషం. దీనికి ఓంకార్‌ యాంకర్‌గా చేస్తుండగా, శ్రీముఖి జడ్జ్ గా చేయడం మరో విశేషం. యాంకర్లు, జడ్జ్ లుగా మారడం చాలా అరుదు. కానీ శ్రీముఖి చాలా తక్కువ సమయంలోనే దాన్ని రీచ్‌ కావడం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం విశేషం. 
 

45

ఈ విషయంలో అనసూయ(Anasuya), రష్మి(Rashmi)లకు శ్రీముఖి పెద్ద ఝలక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే పదేళ్లకుపైగా ఈ ఇద్దరు హాట్‌ భామలు యాంకర్లుగా చేస్తున్నారు. `జబర్దస్త్`షోతో పాపులర్‌ అయ్యారు. హాట్‌ అందాలతో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో హాట్‌ భామలుగా పేరుతెచ్చుకున్నారు. అందాల ఆరబోతలోనూ ఒకరికొకరు పోటీ పడుతుంటారు. కానీ అదంతా యాంకరింగ్‌ వరకే పరిమితమయ్యిందని చెప్పొచ్చు. 

55

ఈ విసయంలో శ్రీముఖి తక్కువేం కాదు.  ఆమె కూడా అనసూయ, రష్మిలకు పోటీనిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వారిని మించిన పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దానికితోడు ఇప్పుడు జడ్జ్ గా మారడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి శ్రీముఖి సెలెంట్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా జడ్జ్ పోస్ట్ ని కొట్టిందని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories