‘నేను ఆంటీనా’.. ట్రోలర్స్ కు అనసూయ గట్టి వార్నింగ్.. వరుస కామెంట్లతో రిప్లై..

Published : Aug 26, 2022, 05:22 PM IST

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)పై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య గట్టిగానే వార్ జరుగుతోంది. తాజాగా తనను ‘ఆంటీ’ అంటూ ట్రోల్ చేస్తున్న వారందరికీ అనసూయ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 

PREV
16
‘నేను ఆంటీనా’.. ట్రోలర్స్ కు అనసూయ గట్టి వార్నింగ్.. వరుస కామెంట్లతో రిప్లై..

స్టార్ యాంకర్ గా వెలుగొందుతున్న అనసూయ భరద్వాజ్, ఇటు సినిమాల్లోనూ విభిన్న పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను  అలరిస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ఆడియెన్స్ లో కావాల్సినంత  క్రేజ్  సంపాదించుకుంది. తనను మద్దతు చేసే వారెందరు ఉన్నారో.. నివారించే వారి సంఖ్య గట్టిగానే ఉంటోంది.
 

26

తాజాగా అనసూయపై సోషల్ మీడియా వేదికన ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా సందర్భంగా అనసూయ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ప్రస్తుతం మళ్లీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన సినిమా ‘లైగర్’పై అనసూయ ట్వీట్ చేయడంతో మళ్లీ రచ్చ మొదలైంది. 
 

36

నిన్నటి నుంచి విజయ్ ఫ్యాన్స్ - అనసూయకు మధ్య గట్టి వార్ నడుస్తోంది. మరోవైపు అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక్కతే అందరినీ ఎదుర్కొంటోంది. తనదైన శైలిలో బదులిస్తూ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంటోంది. ఈ క్రమంలో తనను ‘ఆంటీ’ అంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ ను చాలా సీరియస్ గా తీసుకుంది.  దీనికి బదులుగా వరుస ట్వీట్లు చేస్తూ వస్తోంది.

46

అనసూయ ట్వీట్ చేస్తూ.. ‘నాపై దుర్భాషలాడిన వారందరీ అకౌంట్స్‌ ను  స్క్రీన్ షాట్స్ తీస్తున్నా. నా వ‌య‌సు ఉద్దేశించి ‘ఆంటీ’ అంటు తిడుతున్నారు. నా కుటుంబాన్ని కూడా లాగుతున్నారు. కాబ‌ట్టి మీ అంద‌రిపై కేసు పెడ‌తాను. ఫలితంగా మీరు బాధ‌ప‌డాల్సి ఉంటుంది.’ అని ఓ ట్వీట్ చేసింది.

56

మరో ట్వీట్ లో.. ‘న‌న్ను తిట్టినవారుందరూ కాస్తా ఆలోచించాలి. నేనెందుకు ఇలా చేశాను, నేను ఏం చేశాననేది ముందు తెలుసుకోండి. ఫ్యాన్స్ వెనుక దాక్కునే వ్య‌క్తిని కాదు నేను. ఫేక్ ఐడీలతో కొన్నేండ్లుగా తిడుతూ వస్తున్నారు. ఇప్పుడూ అదే కొనసాగుతోంది. నేనూ రీ ట్వీట్ చేస్తాను. ఓ మ‌హిళ పోరాటం చేస్తుంద‌నేందుకు అదే రుజువుగా ఉంటుంది’ అంటూ ట్రోలర్స్ ను ఉద్దేశించి కామెంట్స్ చేసింది.  
 

66

.. అయినా నన్ను ఆంటీ అంటారా.? మీ ఇంట్లో వాళ్ల‌కి మా ఇంట్లో వాళ్ల‌కి ఎలాంటి రిలేష‌న్ లేన‌ప్పుడు నేను మీకు అంటీ ఎందుకవుతాను. మీరు ఇకపై నాపేరు అనసూయ భరద్వాజ్ కు  ముందు ‘శ్రీమతి’ తర్వాత  ‘గారు’ పెట్టాలా? వద్దా? అనేది మీ పెంపకంపై ఆధారపడి ఉందంటూ..  #SayNOtoOnlineAbuse అనే హ్యాష్ ట్యాగ్ తో పోరాటం ప్రారంభించింది. ఇక ఈ ఆన్ లైన్ వార్ ఎంతదూరం పోతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories