#Hebba patel: “ఓదెల రైల్వే స్టేషన్” రివ్యూ

First Published | Aug 26, 2022, 5:39 PM IST

సంపత్‌ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో కె.కె.రాధా మోహన్‌ నిర్మించిన చిత్రం “ఓదెల రైల్వే స్టేషన్” . క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా రివ్యూలోకి వెళితే…


సైకో కిల్లర్..థ్రిల్లర్ సినిమా అనగానే ఇప్పుడు ఓటిటి సినిమానా అని అడిగేస్తున్నారు. ఎందుకంటే ఓటిటిలో ఎక్కువ శాతం ఇలాంటి బాపతు చిత్రాలే ఉంటున్నాయి. ఓ రకంగా ఓటిటిల్లో సినిమా చూద్దామనుకునే వారికి ఇవి మంచి ఎక్సపీరియన్స్ ఇస్తాయి కూడా. జనంలో కూర్చుని చూడదగ్గ సినిమాలు కావవి. అందుకేనేమో ఆహా ఓటిటి వారు మళయాళం నుంచి అలాంటి థ్రిల్లర్స్ వరస పెట్టి తీసుకుని డబ్ చేసి వదిలారు. అవి అయ్యిపోయినట్లున్నాయి. తెలుగు నుంచి కూడా అలాంటి వాటినే ఎంకరేజ్ చేస్తున్నారు. క్రిందటివారం రిలీజైన హైవే ఆ బాపతే. ఇదిగో ఈ వారం మళ్లో మరో సైకో కిల్లర్ థ్రిల్లర్. ఈ సారి రూరల్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు ప్రత్యేకత. మరి ఈ సినిమా నడిచే బొమ్మేనా? రివ్యూలో చూద్దాం. 

Odela Railway Station

కథేంటి
  
అనుదీప్ (సాయిరోనక్) కాస్త సినిమాల పిచ్చి. ఐఏఎస్ వచ్చినా కాదనుకుని ఐపీఎస్ కు వస్తాడు.  ట్రైనింగ్ లో భాగంగా ఓదెల అనే  విలేజ్ కు  వస్తాడు. ఏదో మూడు నెలలు వెళ్లిపోదాం అనుకునేలోగా అక్కడ అతనికి ఛాలెంజ్ చేసే పరిస్దితులు ఎదురౌతాయి. ఆ ప్రశాంత వాతావరణంలో సైకో మర్డర్స్ మొదలవుతాయి. పెళ్లై శోభనం జరిగిన మరుసటి రోజే పెళ్లి కూతురిని ఒక సైకో అతి కితారకంగా రేప్  చేసి చంపేస్తుంటాడు. వరుసగా రెండు మర్డర్స్  జరుగుతాయి. ఈ కేసు అనుదీప్ కి ఒక సవాల్ గా మారుతుంది. ఆ సీరియ‌ల్‌కిల్ల‌ర్‌కు సంబంధించి ఎలాంటి క్లూ  దొరకదు. 

Latest Videos


Odela Railway Station


మరో ప్రక్క రాధ‌ (హెబ్బాపటేల్), తిరుప‌తి(వశిష్ట సింహా) భార్యాభ‌ర్త‌లు. ఇస్త్రీ ప‌నిచేస్తూ బ‌తుకుతుంటారు. అనుదీప్ బట్టలు వీళ్లే ఇస్త్రీ చేస్తూంటూరు. వీళ్లకి పెళ్లై చాలా కాలం అయినా పిల్లలు పుట్టరు.  తిరుపతికి వున్న లైంగిక సమస్య ఉందని డాక్టర్ దగ్గరకు కూడా వెళ్తుంది రాధ. ఈ కథ ఇలా నడుస్తూంటే... అమ్మాయిల హత్యలకు కారణం తిరుపతి తమ్ముడు చందు అనే డౌట్ వచ్చి పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. అయితే అతను స్టేషన్ లో ఉండగానే మరో మర్డర్ జరుగుతుంది. అసలు ఈ మర్డర్స్ కి కారణం. ఆ సీరియల్ కిల్లర్ ని ఎలా పట్టుకున్నారు. అసలు ఎవరా కిల్లర్..అతని గతం ఏమిటి...తన లవర్ స్ఫూర్తితో (పూజితా పొన్నాడ) క‌లిసి అనుదీప్ ఆ కిల్లర్ ని పట్టుకోవటానికి ఏ ప్లాన్ వేసాడు...అది సక్సెస్ అయ్యిందా ? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Odela Railway Station

విశ్లేషణ

సైకో కిల్లర్ చిత్రాల్లో ప్రధానంగా ఆకట్టుకునేది...ఆ కిల్లర్ ..తనను పట్టుకునేవారికి ఏ విధమైన సవాల్ విసురుతున్నారు..పోలీస్ లు వాటిని ఎలా తిప్పి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది. అదే ఈ సినిమాలో మిస్సైంది. కిల్లర్ క్యాజువల్ గా చేసుకుంటూ పోతూంటారు. పోలీస్ లు ఇన్విస్టిగేషన్ ఏదో తూతూ మంత్రంలా చేసుకుంటూ పోతూంటారు. అలాగే సైకో కిల్లర్ ఎందుకా హత్యలు చేస్తున్నాడనే కారణం కూడా ఇంట్రస్టింగ్ గా ఉండాలి. ఇక్కడ అదో మానసిక రుగ్మతతో ముడిపెట్టి ముగించారు. అది కొత్తగా అనిపించవచ్చేమో కానీ కన్వీన్సింగ్ గా అనిపించదు. సినిమా స్క్రీన్ ప్లే ప్లో ఎలా ఉంటుందంటే... మొదటి నుంచి వేరే వ్యక్తుల మీదకు అనుమానాలు వచ్చేలా కథనం నడిపి.. అసలు వ్యక్తి ఎవరన్నది మొదటే ఆడియెన్స్ పసిగట్టేసేలా స్క్రీన్ ప్లే ఉంది. 
 

Odela Railway Station

  ఒక్కో క్యారెక్ట‌ర్‌పై అనుమానాల్ని రేకెత్తిస్తూ చివ‌రి వ‌ర‌కు స‌స్సెన్స్ రివీల్ కాకుండా న‌డిపించేది ఎన్నో సినిమాల్లో చూసిందే అయినా ఇంట్రస్టింగ్ నేరేషన్ అది. అస‌లైన హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ఎపిసోడ్ వరకూ  ఉత్కంఠ‌ను నిలబెడుతుంది. అదే ఫాలో అయ్యారు డైరక్టర్. ఓ పల్లె బ్యాక్ డ్రాప్ లో ఈ హత్యలు జరగటంతో సినిమా కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఎక్కువగా సిటీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతూంటాయి. దాన్ని బ్రేక్ చేసాడు రచయిత సంపత్ నంది. తన సొంత గ్రామమైన ఓదెల‌ను కథకు నేపధ్యంగా ఎంచుకున్నారు సంప‌త్ నంది. ఒగ్గు క‌థ ద్వారా ఆ ప్రాంత విశిష్ట‌త‌ను, అక్క‌డి  వాతావ‌ర‌ణం, మ‌నుషులు, మ‌న‌స్త‌త్వాల చూపిస్తూనే క‌థ‌లోకి వెళ్ల‌డం బాగుంది. అంతకు మించి చెప్పుకునేటంత మెరుపులు అయితే కథలో లేవు.

Odela Railway Station


 టెక్నికల్ గా ...

ఈ సినిమా కు పెద్ద ప్లస్ సినిమాటోగ్రఫీ. పెద్ద మైనస్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. చాలా చోట్ల లాగ్ గా సాగుతున్న ఫీల్ కలుగుతుంది. డైరక్షన్ ఓకే ఓకే అన్నట్లుంది. అనూప్ రూబెన్స్ ....సినిమా ఇంటెన్స్ సీన్స్ కు తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తమ్మిరాజు ఎడిటింగ్ చాలా వరకు సినిమాని రక్షించింది. సంపత్ నంది రైటింగ్ టీమ్ కూడా ఫెయిలైంది.  తక్కువ ఖర్చులోనే తీసినట్టు అనిపించినా.. తెలంగాణ పల్లెను మాత్రం చక్కగా చూపించారు.

నటీనటుల్లో హెబ్బా పటేల్ చాలా బాగా నటించేసింది. ఆమె  చాలా నాచురల్ గా  అనిపిస్తుంది. యాస, భాష, కట్టూబొట్టూ అన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి దగ్గరగా డిజైన్ చేసారు.  తిరుపతి పాత్రలో కనిపించిన వశిష్ట , అనుదీప్ పాత్రలో సాయి రోనక్ ఓకే అనిపించాడు. పూజిత పొన్నాడ చివర్లో కనిపించింది. 
 

Odela Railway Station

బాగున్నవి:
సినిమాటోగ్రఫీ
సంగీతం
కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్
 
బాగోలేనివి: 
కొన్ని ల్యాగ్ సీన్స్ 
బోర్ కొట్టించే  స్క్రీన్ ప్లే

ఫైనల్ థాట్: 
రన్ టైమ్  చాలా తక్కువ ఉండటం, అది కూడా ఓటీటీలో విడుదల కావడంతో ఓదెల రైల్వే స్టేషన్‌లో ఓకే ఓ సారి చూడచ్చు  
Rating: 2/5
---సూర్య ప్రకాష్ జోశ్యుల

Odela Railway Station


నటీనటులు :హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేష్, సురేందర్ రెడ్డి, హారిక, ప్రవణ్య రెడ్డి, దివ్య, నవీన్,
 డీవోపీ – సౌందర్ రాజన్. ఎస్
ఎడిటర్ – తమ్మి రాజు
సంగీతం – అనూప్ రూబెన్స్
లిరిక్స్  – కాసర్ల శ్యామ్
ఆర్ట్ డైరెక్టర్ – కొలికపోగు రమేష్
స్టంట్స్ – రియల్ సతీష్
కో రైటర్స్ – గణేష్ ఉప్పునూటి, ప్రదీప్ రెడ్డి, శ్రీకాంత్
డైరెక్షన్ టీమ్ – ఆడెపు గిరిరాజ్, ప్రణయ్‌కేతన్ ఈదునూరి
ప్రొడక్షన్ కంట్రోలర్ – ఎం శ్రీనివాసరావు (గడ్డం శ్రీను), సాధనానందం.
పబ్లిసిటీ డిజైనర్ – రమేష్ కొత్తపల్లి
అసోసియేట్ ఎడిటర్: తారక్
వీఎఫ్ఎక్స్ : ప్రదీప్ పూడి
క్రియేటర్ – సంపత్ నంది
నిర్మాత – కెకె రాధా మోహన్
దర్శకత్వం – అశోక్ తేజ
రన్ టైమ్: :1 Hrs 35 Min
విడుదల తేదీ : ఆగస్టు 26, 2022

click me!