2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు

Published : Dec 11, 2025, 09:30 AM IST

2025 Flop Heroines: 2025 సంవత్సరం కొందరు హీరోయిన్లకు మంచి ఫలితాలని ఇస్తే.. మరికొందరికి నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
2025లో ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోయిన్లు

ఈ ఏడాది కొందరు హీరోయిన్లకు పరాజయాలు తప్పలేదు. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే, కీర్తి సురేష్ లకు ఈ ఏడాది ఫ్లాపులు ఎదురయ్యాయి. 2025లో వారికి ఎదురైన ఫ్లాప్ సినిమాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

25
శ్రీలీల

శ్రీలీల పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఈ ఏడాది శ్రీలీల నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. నితిన్ తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలు మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన జూనియర్ సినిమా కూడా ఫ్లాపే. రీసెంట్ గా విడుదలైన రవితేజ మాస్ జాతర చిత్రం అట్టర్ ఫ్లాప్ చిత్రాల లిస్ట్ లో చేరిపోయింది.

35
భాగ్యశ్రీ బోర్సే

భాగ్యశ్రీకి క్రేజ్ పెరుగుతోంది కానీ సక్సెస్ దక్కడం లేదు. గతేడాది భాగ్యశ్రీకి మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ ఎదురైంది. ఈ ఏడాది ఆమె నటించిన కింగ్డమ్ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన కాంత కూడా నిరాశపరిచింది. రీసెంట్ గా విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల ఆదరణ లభించడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి సరైన వసూళ్లు దక్కడం లేదు.

45
పూజా హెగ్డే

పూజా హెగ్డే బాలీవుడ్ లో దేవా అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో సూర్యతో నటించిన రెట్రో చిత్రం కూడా డిజాస్టర్ అయింది. కూలీ చిత్రంలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ బాగా వైరల్ కావడం మాత్రమే ఈ ఏడాది పూజా హెగ్డే కి పాజిటివ్ రిజల్ట్.

55
కీర్తి సురేష్

కీర్తి సురేష్ ఈ ఏడాది ఉప్పు కప్పురంబు, రివాల్వర్ రీటా అనే చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు నిరాశ పరిచాయి.

Read more Photos on
click me!

Recommended Stories