సమంత X శ్రీలీల.. పుష్ప 2 హంగామా, ట్రోలింగ్ మొదలైందిగా

First Published | Nov 7, 2024, 1:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతోంది. షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. నవంబర్ 17 కల్లా షూటింగ్ పూర్తి కానుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న థియేటర్స్ లో రచ్చ చేసేందుకు సిద్ధం అవుతోంది. షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. నవంబర్ 17 కల్లా షూటింగ్ పూర్తి కానుంది. ప్రస్తుతం సుకుమార్ ఐటెం సాంగ్ షూటింగ్ ప్రారంభించారట. 

sreeleela

అందుతున్న సమాచారం మేరకు శ్రీలీల ఐటెం సాంగ్ కోసం పుష్ప 2 సెట్స్ లోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. సాంగ్ లో సమంత కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ శ్రీలీల మాత్రమే బన్నీతో డ్యాన్స్ చేయబోతున్నట్లు టాక్. పుష్ప చిత్రానికి ఆ స్థాయిలో బజ్ వచ్చింది అంటే సమంత చేసినా ఊ అంటావా ఐటెం సాంగ్ కూడా కారణం. 


ఆ సాంగ్ ఒక ఊపు ఊపింది. నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఇప్పుడు శ్రీలీల.. సమంత స్థాయిలో పుష్ప 2 చిత్రానికి ప్లస్ అవుతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది. శ్రీలీలకి డ్యాన్స్ పరంగా తిరుగులేదు. అల్లు అర్జున్, శ్రీలీల డ్యాన్స్ అదరగొడతారు. ఆల్రెడీ శ్రీలీల సమంత మధ్య పోలికలు పెడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయింది. 

samantha

శ్రీలీలకి ఆమె అభిమానులు, సమంతకి ఆమె ఫ్యాన్స్ మద్దతు తెలుపుతూ ట్రోల్ చేసుకుంటున్నారు. సాంగ్ రిలీజ్ అయ్యాక ఇంకెంత హంగామా ఉంటుందో చూడాలి. పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ చాలా మంది పేర్లు పరిశీలించింది. చివరికి శ్రీలీలని ఫైనల్ చేశారు. 

Latest Videos

click me!