సాయి పల్లవి సౌత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న నటి. నటన మాత్రమే కాదు డ్యాన్స్ చేయడంలో కూడా సౌత్ లో సాయి పల్లవి బెస్ట్ హీరోయిన్స్ లో ఒకరు. కొందరు హీరోయిన్లు అందంగా ఉంటారు, బాగా నటిస్తారు. కానీ డ్యాన్స్ చేయలేకపోవచ్చు. కానీ అన్ని క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న హీరోయిన్ సాయి పల్లవి. అందుకే ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యువతని కూడా ఫిదా చేసింది.